రోజూ ఉదయం కప్పు మొలకెత్తిన పెసర్లు తింటే.. నాన్-వెజ్ తిన్నంత బలం!
ప్రోటీన్ల ఖజానా
మొలకెత్తిన పెసర్లలో ప్రోటీన్లు, ఫైబర్ నిండుగా ఉంటాయి. ఇవి వేగంగా బరువు తగ్గడానికి తోడ్పడతాయి.
ఎనర్జీ బూస్టర్
ఉదయాన్నే ఒక కప్పు పెసర్లు తీసుకుంటే త్వరగా ఆకలి వేయదు; రోజంతా శరీరం ఉత్సాహంగా, యాక్టివ్‌గా ఉంటుంది.
తక్కువ కేలరీలు
బరువు తగ్గాలని ప్రణాళిక వేసుకునేవారికి ఇది బెస్ట్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్.
జీర్ణ వ్యవస్థకు మేలు
వీటిలోని ఎంజైమ్స్ ఆహారాన్ని తేలికగా జీర్ణం చేయడమే కాకుండా, గ్యాస్ మరియు మలబద్ధక సమస్యలను దూరం చేస్తాయి.
మెటబాలిజం ఇంప్రూవ్మెంట్
రోజూ ఉదయం తినడం వల్ల మెటబాలిజం రేటు పెరిగి, కేలరీలు వేగంగా కరుగుతాయి.
మధుమేహ బాధితులకు దివ్యౌషధం
ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
నాన్-వెజ్‌తో సమానమైన పోషకాలు
మటన్, చికెన్, గుడ్లు, చేపల్లో లభించే విటమిన్ బి కాంప్లెక్స్, పొటాషియం మరియు పవర్వాల్ ప్రొటీన్లు అన్నీ మొలకెత్తిన పెసర్లలో లభిస్తాయి.
రోగనిరోధక శక్తి
విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ పెరిగి వివిధ ఇన్ఫెక్షన్ల నుంచి శరీరం రక్షించబడుతుంది.
గుండెకు రక్షణ
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి.
రుచికరమైన మార్గం
వీటిని అలాగే పచ్చిగా లేదా కొద్దిగా ఆవిరిపై ఉడికించి.. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం కలుపుకుని తింటే రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి.