ఈపీఎఫ్‌ఓలో ఏళ్ల తరబడి క్లెయిమ్ కాకుండా నిరుపయోగంగా పడి ఉన్న వేల కోట్ల రూపాయలను అసలైన సబ్‌స్క్రైబర్లకు చేర్చేందుకు కేంద్రం ఆటోమేటిక్ రీఫండ్ విధానం తెచ్చింది.
దరఖాస్తులు లేకుండానే నేరుగా ఖాతాల్లోకి
ఇకపై సబ్‌స్క్రైబర్లు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా ఎలాంటి ఫారమ్‌లు నింపాల్సిన అవసరం లేకుండానే నిధులు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి.
కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆమోదం
ఈపీఎఫ్‌ఓ ప్రవేశపెట్టిన ఈ విప్లవాత్మక ఆటోమేటిక్ రీఫండ్ పైలట్ ప్రాజెక్ట్‌కు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ 2026 ఫిబ్రవరి 23న ఆమోదం తెలిపారు.
తొలి దశలో రూ.1,000 వరకు ఉన్న నిధులు
మొదటి విడతగా రూ.1,000 వరకు సొమ్మున్న 7.11 లక్షల ఇన్‌యాక్టివ్ ఖాతాలను గుర్తించి, వాటిలో ఉన్న రూ.30.52 కోట్ల బదిలీకి ఏర్పాట్లు చేస్తున్నారు.
పెన్నీ డ్రాప్ టెస్ట్ ద్వారా వెరిఫికేషన్
ఖాతాదారుల వివరాలు సరిగా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఆధార్‌తో లింకైన బ్యాంక్ ఖాతాలో రూ.1 జమ చేసి (Penny Drop) పారదర్శకంగా పరిశీలిస్తున్నారు.
ఇప్పటికే 1.18 లక్షల ఖాతాల పరిశీలన
సురక్షితమైన రీఫండ్ ప్రక్రియ కోసం ఇప్పటికే దాదాపు 1.18 లక్షల సబ్‌స్క్రైబర్ల బ్యాంక్ ఖాతా వివరాల సాంకేతిక సరిపోలిక విజయవంతంగా పూర్తయింది.
సీ-డాక్ (C-DAC) ఆధ్వర్యంలో ఐటీ అప్‌గ్రేడ్
ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘సి-డాక్’ సంస్థ ద్వారా ఈపీఎఫ్‌ఓ సాఫ్ట్‌వేర్‌లో ‘సిస్టమ్ జెనరేటెడ్ క్లెయిమ్’ ఫీచర్‌ను జోడిస్తున్నారు.
ఆగస్టు చివరి నాటికి బదిలీల ప్రారంభం
సిస్టమ్ అప్‌గ్రేడేషన్ పనులు ఆగస్టు చివరి నాటికి పూర్తి కానున్నాయి, ఆ తర్వాత అర్హులైన చందాదారుల ఖాతాల్లోకి నేరుగా డబ్బుల బదిలీలు ప్రారంభమవుతాయి.
రూ.1,000 కంటే ఎక్కువ ఉన్న ఖాతాలకూ వర్తింపు
పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యాక రూ.1,000 కంటే ఎక్కువ సొమ్ము ఉన్న 24.76 లక్షల ఇన్‌యాక్టివ్ ఖాతాల నిధులను కూడా ఆటోమేటిక్‌గా రీఫండ్ చేస్తారు.
రూ.10,903 కోట్ల క్లెయిమ్‌ల పరిష్కారం
గత రెండేళ్లలో ఏర్పడిన 31.86 లక్షల ఇన్‌యాక్టివ్ ఖాతాల్లోని దాదాపు రూ.10,903 కోట్ల క్లెయిమ్ చేయని సొమ్ము ఈ కొత్త వ్యవస్థతో లబ్ధిదారులకు చేరుతుంది.