ఒమేగా 3 పవర్

ఇందులో ఉండే ఆల్ఫా లైనోలిక్ యాసిడ్ ఒమేగా 3 గుండెకు మేలు చేసి వాపులను తగ్గిస్తుంది.
తక్కువ క్యాలరీలు:
ఈ గింజల్లో క్యాలరీలు తక్కువగా ఉండి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. రోజుకి ఒక స్పూన్ చాలు.
కొలెస్ట్రాల్ తగ్గుదల
ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, శరీర మెటబాలిజం రేటును వేగంగా పెంచడానికి దోహడపడతాయి.
బరువు నిర్వహణ
ఫైబర్ ఎక్కువగ ఉండటం వల్ల త్వరగా ఆకలి వేయకుండా చేసి బరువు తగ్గడంలో సహాయపడతాయి.
బిపి నియంత్రణ
ఇవి సిస్టోలిక్, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్‌ను తగ్గించి రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
తీసుకునే విధానం
ఉదయం బ్రేక్‌ఫాస్ట్, రాత్రి డిన్నర్‌లో ఒక టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుంటే మంచిది.
జీర్ణశక్తి మెరుగు
ఇందులో ఉండే కరగని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది.
నానబెట్టి తినడం
ఒక చెంచా అవిసె గింజలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టి ప్రతిరోజు హ్యాపీగా తీసుకోవచ్చు.
షుగర్ కంట్రోల్
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు ప్రోటీన్ ఆహారంతో తీసుకుంటే షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి.
లిగ్నన్స్ రక్షణ:
వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, లిగ్నన్స్ గుండెను కాపాడుతూ మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి.