Flipkart: ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నిర్వహించే ఈ ఏడాది అత్యంత భారీ సేల్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 కోసం కోట్లాది మంది కస్టమర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి ఏటా పండగ సీజన్‌కు ముందు వచ్చే ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలపై ఊహించని రీతిలో భారీ డిస్కౌంట్లు లభిస్తాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఏడాది ఈ మహా సేల్ అక్టోబర్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు మాత్రం ఒక రోజు ముందే అంటే అక్టోబర్ 8వ తేదీనే ఎర్లీ యాక్సెస్ లభించనుంది.