చాలామంది దైవచింతనలో భాగంగా వారానికి ఒకటి లేదా రెండు రోజులు ఉపవాసం చేస్తారు.
ఉపవాసం వల్ల చాలా సార్లు మలబద్ధకం, అసిడిటీ సమస్యలు ఏర్పడుతాయి, కొన్ని చిట్కాలను అనుసరించవచ్చు.
ఉపవాసం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
హైడ్రేటెడ్ గా ఉండండి... ఒకేసారి ఎక్కువ నీరు తాగే బదులు సిప్ బై సిప్ నీరు తాగాలి.
ఆరోగ్యకరమైన పానీయాలు... మజ్జిగ, చల్లని పాలు, కొబ్బరి నీరు శరీరం నుంచి హానికరమైన టాక్సిన్స్ తొలగించడంలో సహాయపడుతుంది.
అధిక ఫైబర్... ఆహారంలో బుక్వీట్ పిండి, మఖానా, రాగిపిండి వంటి ఆహారాలను చేర్చుకోవచ్చు.
వ్యాయామం... హై ఇంటెన్సిటీ వర్కవుట్‌లు చేయాల్సిన అవసరం లేదు. యోగా, నడక వంటివి చేయవచ్చు.
సిట్రస్ పండ్లు తినవద్దు... ఖాళీ కడుపుతో పుల్లటి పండ్లను తినడం వల్ల ఎసిడిటీ సమస్యలు వస్తాయి.
జంక్ ఫుడ్... ఉపవాసం చేసేటప్పుడు ఆరోగ్యానికి హాని చేసే ఆహార పదార్థాలను తీసుకుంటే ఉపవాసం చేయకూడదు.