చలికాలంలో స్కిన్ హెల్తీగా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలోవ్వాల్సిందే

చలికాలం
చలికాలంలో చర్మ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. చర్మం బాగా పొడిబారుతుంది. దీంతోపాటు మరిన్ని ఇబ్బందులు తలెత్తుతుంటాయి. అందుకే చలికాలంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అవేంటో చూద్దాం.
సరైన మాయిశ్చరైజర్స్
చలికాలంలో అతిపెద్ద సమస్య చర్మం పొడిబారటం. అందుకే చర్మం హైడ్రేటెడ్ గా ఉండేందుకు మాయిశ్చరైజర్స్ వాడుతుండాలి. ఆయిల్ బేస్డ్ మాయిశ్చరైజర్లు, లోషన్స్ వాడాలి. చర్మం పొడిబారే సమస్యను తగ్గిస్తాయి.
రూమ్ హీటర్స్ వాడితే జాగ్రత్త
చలికాలంలో వెచ్చగా ఉండాలని చాలా మంది రూమ్ హీటర్స్ వాడుతుంటారు. వీటి ప్రభావం చర్మంపై ఎక్కువగా ఉంటుంది. అందుకే టెంపరేచర్ అవసరానికి మంచి వాడకూడదు.
మృధువుగా క్లెన్సింగ్
చలికాలంలో చర్మానికి క్లెన్సింగ్ చాలా జాగ్రత్తగా మృధువుగా చేసుకోవాలి. ఒకవేళ కఠినంగా చేస్తే చర్మంలోని నేచురల్స్ ఆయిల్స్ వెళ్లిపోతాయి. దీంతో చర్మం పొడిగా మారుతుంది.
తగినంత నీరు తాగాల్సిందే
చలికాలమైనా అందరూ నీరు తగినంత తాగాల్సిందే. వాతావరణం చల్లగా ఉన్న కారణంగా చాలా మంది నీటిని ఎక్కువగా తాగరు. ఇలా చేస్తే చర్మానికి హాని కలిగిస్తుంది.
పోషకాలు అవసరం
చలికాలంలో పోషకాహారం తీసుకోవడం వల్ల చర్మానికి రక్షణ ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఆహారం ఈ కాలంలో తీసుకోవాలి. వాటిలోని పోషకాలు చర్మానికి మేలు చేస్తాయి.
సన్‍స్క్రీన్
వేసవిలో మాత్రమే సన్ స్క్రీన్ అవసరమని అనుకుంటారు. కానీ చలికాలంలో కూడా సన్ స్క్రీన్ చాలా ముఖ్యం. యూవీ కిరణాలను శీతాకాలంలోనూ ప్రభావం చూపిస్తాయి. వీటి వల్ల చర్మ సమస్యలు మరింత ఎక్కువౌతాయి. అందుకే చలికాలంలో కూడా సన్ స్క్రీన్ రాసుకోవడం మంచిది.