ఖర్జూరాలతో తక్షణ శక్తి

పిల్లలకు రోజూ తగినంత శక్తి అందడానికి ఖర్జూరాలను ఆహారంలో చేర్చడం చాలా మంచిది.
వాల్‌నట్స్‌తో హెల్థ్ ఫ్యాట్స్
మెదడు ఆరోగ్యానికి, ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం పిల్లలకు వాల్‌నట్స్ తినిపించాలి.
కంటి చూపునకు గుడ్లు
పిల్లల కళ్ళ అభివృద్ధికి, చూపు మెరుగవడానికి డైట్‌లో క్రమం తప్పకుండా గుడ్లను ఇవ్వాలి.
ప్రొబయోటిక్స్ కోసం పెరుగు
జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి, ప్రొబయోటిక్స్ అందడానికి పెరుగు ఎంతో ఉపయోగపడుతుంది.
ఐరన్ కోసం ఆకుకూరలు
శరీరంలో రక్తం బాగా వృద్ధి చెందడానికి, ఐరన్ అందడానికి ఆకుకూరలను వండి పెట్టాలి.
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు
మెదడు చురుకుగా పనిచేయడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫ్యాటీ ఫిష్‌ను అందించాలి.
యాంటీఆక్సిడెంట్ల కోసం బెర్రీలు
మెదడు కణాలను రక్షించే యాంటీఆక్సిడెంటల్ గుణాలు ఉండే బెర్రీలను పిల్లలకు తినిపించాలి.
పీచు పదార్థం కోసం ఓట్స్
జీర్ణక్రియ సక్రమంగా సాగేందుకు, ఫైబర్ అందడానికి ఓట్స్ మంచి ఆహార ఎంపిక.
తెలివితేటల పెరుగుదలకు తోడ్పాటు
ఇలాంటి పౌష్టికాహారం అందించడం ద్వారా పిల్లల్లో ఏకాగ్రత, తెలివితేటలు మెరుగ్గా వృద్ధి చెందుతాయి.
వైద్యుల సరైన సలహాలు
పిల్లల ఆహారపు అలవాట్లలో ఎలాంటి మార్పులు చేయాలన్నా నిపుణులైన వైద్యుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.