అధికారికంగా ఫ్రీ ఫైర్ ఇండియా రాక:

BGMI తరహాలోనే మరొక పాపులర్ మొబైల్ గేమింగ్ అప్లికేషన్ అక్టోబర్ 28న భారతీయ మార్కెట్లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టనుంది.
ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లో లభ్యత:
గూగుల్ ప్లే స్టోర్ అలాగే ఆపిల్ యాప్ స్టోర్ ద్వారా ఈ గేమ్‌ను వినియోగదారులు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రత్యేకంగా భారత్ కోసం రూపకల్పన:
కేవలం భారతీయ గేమర్ల అభిరుచులకు తగినట్లుగా స్థానిక కంటెంట్, ప్రత్యేక ఫీచర్లతో ఈ యాప్‌ను తీర్చిదిద్దారు.
దీపావళి కానుకగా ప్రత్యేక ఈవెంట్స్:
గేమ్ విడుదల సందర్భంగా నవంబర్ 15 వరకు ప్రత్యేక దీపావళి క్యాంపెయిన్‌లను నిర్వహించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
అన్ని రకాల ఫోన్లలో సాఫీగా రన్:
కేవలం హై-ఎండ్ స్మార్ట్‌ ఫోన్లే కాకుండా వివిధ రకాల సాధారణ స్మార్ట్‌ ఫోన్లలో కూడా పనిచేసేలా గేమ్‌ను ఆప్టిమైజ్ చేశారు.
యువత భద్రతకు పెద్దపీఠ:
తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయడం, సమయ పరిమితులు వంటి బాధ్యతాయుతమైన ఫీచర్‌లను ఇందులో చేర్చారు.
డేటా భద్రత, సర్వర్లు:
భారత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వినియోగదారుల డేటాను స్థానిక సర్వర్లలో భద్రపరిచే ఏర్పాట్లు చేశారు.
ఈస్పోర్ట్స్ రంగానికి భారీ ప్రోత్సాహం:
భారతదేశంలో పెరుగుతున్న ఈ స్పోర్ట్స్ కమ్యూనిటీకి మద్దతుగా స్థానిక టోర్నమెంట్లు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
గత నిషేధం నుంచి కొత్త పాఠాలు:
గతంలో తలెత్తిన భద్రతా పరమైన సమస్యలను పూర్తిగా పరిష్కరించుకుని సరికొత్త నిబంధనలతో ఈ గేమ్‌ను మళ్లీ తీసుకువస్తున్నారు.
గేమర్లలో విపరీతమైన ఉత్సాహం:
ఈ పాపులర్ గేమ్ మళ్లీ ప్లే స్టోర్‌లోకి వస్తుండటంతో దేశవ్యాప్తంగా ఉన్న యువ గేమర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.