షాపులో తాజా చేపలను కనిపెట్టడం ఎలా..? ఈ సింపుల్ ట్రిక్స్ తెలిస్తే అస్సలు మోసపోరు

మొదటి చూపు కళ్లపైనే
మీరు చేపలు కొనడానికి వెళ్లినప్పుడు మొదట దాని కళ్లను గమనించాలి. తాజా చేపల కళ్లు ఎప్పుడూ స్పష్టంగా, నల్లగా, ప్రకాశవంతంగా మెరుస్తూ కనిపిస్తాయి.
మసక కళ్లు ఉంటే నో చెప్పండి
ఒకవేళ చేప కళ్లు లోపలికి కుంగిపోయినట్లు ఉన్నా.. లేదా తెల్లగా మసకబారినట్లు కనిపిస్తే అది పాత చేప అని అర్థం, వాటిని అస్సలు కొనకండి.
మొప్పల రంగు ముఖ్యం
చేపల నాణ్యతను తెలుసుకోవడానికి వాటి మొప్పలను తెరిచి చూడాలి. తాజా చేపల మొప్పలు మంచి ఎరుపు లేదా గులాబీ రంగులో ఉంటాయి.
ముదురు రంగు ఉంటే పాతదే :
చేప మొప్పలు ముదురు బ్రౌన్ రంగులోకి మారినా లేదా పూర్తిగా పొడిగా అనిపించినా.. ఆ చేపను చాలా రోజుల పాటు ఐస్‌లో నిల్వ ఉంచారని ఫిక్స్ అయిపోవచ్చు.
చేతితో నొక్కి చూడండి
చేప శరీరాన్ని మీ వేలితో లైట్‌గా నొక్కి చూడాలి. ఫ్రెష్ చేప మాంసం ఎప్పుడూ గట్టిగా ఉంటుంది. వేలితో నొక్కగానే అది వెంటనే స్ప్రింగ్‌లా పాత స్థితికి వచ్చేస్తుంది.
మెత్తటి మాంసం డేంజర్
ఒకవేళ మీరు వేలితో నొక్కినప్పుడు ఆ భాగం అలాగే లోపలికి గుంతలా ఉండిపోయినా.. లేదా మాంసం బాగా వదులుగా, మెత్తగా అనిపించినా అది నాణ్యత లేని పాత చేప.
చర్మం మెరుపు లీక్ చేస్తుంది
తాజా చేపల చర్మం ఎప్పుడూ తేమగా, సహజమైన మెరుపుతో ఉంటుంది. చర్మంపై ఉండే పొలుసులు కూడా గట్టిగా పట్టుకుని ఉంటాయి.
పొడి చర్మం వద్దు
చేప చర్మం రంగు వెలిసిపోయినట్లు ఉన్నా.. లేదా పూర్తిగా పొడిగా మారినట్లు అనిపిస్తే.. దానిని చాలా కాలం పాటు ఫ్రిజ్‌లో డీప్ ఫ్రీజ్ చేశారని అర్థం.
కట్ చేసినప్పుడు జిడ్డు ఉంటే నో
కొన్నిసార్లు చేపలను కట్ చేసినప్పుడు లోపలి ముక్కలు తెల్లగా, ఫ్రెష్‌గా ఉండకుండా జిడ్డుగా కనిపిస్తాయి. అలాంటి వాటికి దూరంగా ఉండటమే మంచిది.
నమ్మకమైన దుకాణమే ముఖ్యం
అన్నింటికంటే ముఖ్యంగా ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండే, నమ్మకమైన లైవ్ ఫిష్ షాపుల నుండి మాత్రమే చేపలను కొనడం ఆరోగ్యానికి ఎంతో సురక్షితం.