ఒకే సినిమాలో 30 ముద్దు సీన్లు.. రాత్రికి రాత్రే నేషనల్ క్రష్‌గా మారిన బ్యూటీ
పుట్టుక - చదువు:
సోనాల్ చౌహాన్ 1987 మే 16న ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జన్మించారు. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక గార్గి కాలేజీలో ఆమె తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
మొదటి రికార్డు:
చదువుకునే రోజుల్లోనే మోడలింగ్‌పై ఆసక్తి పెంచుకున్న సోనాల్, 2005లో మిస్ వరల్డ్ టూరిజం టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించారు.
మ్యూజిక్ ఆల్బమ్‌తో క్రేజ్:
హిమేష్ రేష్మియా పాపులర్ మ్యూజిక్ ఆల్బమ్ ఆప్కా సురూర్‌లోని సంఝో నా సాంగ్‌లో నటించి గ్లామర్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.
నేషనల్ క్రష్‌గా ఎంట్రీ:
2008లో ఇమ్రాన్ హష్మీ సరసన నటించిన జన్నత్ సినిమాతో బాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వడమే కాకుండా ఆమెను నేషనల్ క్రష్‌గా మార్చేసింది.
30 ముద్దు సీన్ల సంచలనం:
2013లో నీల్ నితిన్ ముఖేష్‌తో కలిసి నటించిన 3G – ఎ కిల్లర్ కనెక్షన్ అనే హర్రర్ థ్రిల్లర్ చిత్రంలో ఏకంగా 30 లిప్‌లాక్ సీన్లలో నటించి ఇండస్ట్రీని షేక్ చేశారు.
మర్డర్ రికార్డ్ బ్రేక్:
అంతకుముందు ఇమ్రాన్ హష్మీ, మల్లికా షెరావత్ కాంబినేషన్‌లో వచ్చిన మర్డర్ సినిమాలో 20 కిస్ సీన్స్ ఉండగా.. 3G సినిమాతో సోనాల్ ఆ బోల్డ్ రికార్డును బ్రేక్ చేశారు.
సోనాల్ వివరణ:
ఈ వివాదంపై అప్పట్లో సోనాల్ స్పందిస్తూ.. కేవలం పబ్లిసిటీ కోసం తాను బోల్డ్ సీన్స్ చేయలేదని, కథ డిమాండ్ చేయడం వల్లే ఆ సీన్లలో నటించాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు.
టాలీవుడ్ ఎంట్రీ:
బాలీవుడ్‌లో ఆశించిన విజయాలు రాకపోవడంతో టాలీవుడ్ వైపు అడుగులు వేశారు. తెలుగులో ఆమె మొదటి చిత్రం రెయిన్‌బో (2008).
బాలకృష్ణతో హిట్ కాంబో:
నందమూరి బాలకృష్ణ సరసన లెజెండ్, డిక్టేటర్, రూలర్ వంటి వరుస చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు.
స్టార్ హీరోల సరసన, లేటెస్ట్ లుక్:
ప్రభాస్ (ఆదిపురుష్), నాగార్జున (ది ఘోస్ట్) వంటి స్టార్స్ సరసన మెరిసిన సోనాల్, చివరగా ఎఫ్3లో సందడి చేశారు. ప్రస్తుతం అల్ట్రా స్టైలిష్ ఫోటోషూట్లతో సోషల్ మీడియా క్వీన్‌గా దూసుకుపోతున్నారు.