నటి కావాలనే గట్టి పట్టుదలతో అనంతపురం జిల్లా కదిరి నుంచి హైదరాబాద్ చేరుకున్న స్రవంతి.. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ స్టార్ట్ చేసింది.
పెళ్లితో బ్రేక్:
కెరీర్ ఎదుగుతున్న సమయంలోనే ప్రేమ పెళ్లి చేసుకున్న స్రవంతి.. అత్తింటి వారి ఇష్టం కోసం సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది.
భర్త వ్యాపారంలో నష్టాలు:
స్రవంతి భర్త ప్రశాంత్ పెళ్లికి ముందు బిజినెస్ చేసేవారు. అయితే స్నేహితులను అతిగా నమ్మి మోసపోవడంతో భారీగా డబ్బు నష్టపోయారు.
సేల్స్ గర్ల్‌గా స్రవంతి:
ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో భర్త ప్రైవేట్ జాబ్‌లో చేరగా.. స్రవంతి ఒక జ్యువెలరీ షాప్‌లో సేల్స్ గర్ల్‌గా పనిచేసింది. కానీ అనారోగ్యం వల్ల ఆ ఉద్యోగం వదిలేయాల్సి వచ్చింది.
సెకండ్ ఇన్నింగ్స్:
ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి భర్త ప్రోత్సాహంతో నటిగా కాకుండా ఈసారి చలాకీ యాంకర్‌గా బుల్లితెరపై సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.
బిగ్ బాస్ పాపులారిటీ: యాంకర్‌గా రాణిస్తున్న సమయంలోనే బిగ్ బాస్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి, తన గ్లామర్‌తో ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.
బిగ్ బాస్ పాపులారిటీ:
యాంకర్‌గా రాణిస్తున్న సమయంలోనే బిగ్ బాస్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి, తన గ్లామర్‌తో ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.
రెండు పెళ్లిళ్ల గుట్టు:
స్రవంతికి రెండు పెళ్లిళ్లు అయ్యాయనే రూమర్లపై ఆమె భర్త క్లారిటీ ఇస్తూ.. మొదట రహస్యంగా పెళ్లి చేసుకున్నామని, ఆ తర్వాత పెద్దలను ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకున్నామని వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ వీరాభిమానులు:
స్రవంతి, ప్రశాంత్ ఇద్దరూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమానులు. అందుకే తమ కొడుకుకు అకీరా నందన్ అని పేరు పెట్టుకున్నారు.
బిజినెస్ ఉమెన్‌గా రాణిస్తూ:
యాంకరింగ్‌తో సీనియర్లకు పోటీ ఇస్తూనే.. మరోవైపు తన కొడుకు పేరిట అకీరా అనే బొటిక్‌ను స్టార్ట్ చేసి సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్‌గా దూసుకుపోతోంది.
లేటెస్ట్ ఫోటోల హల్చల్:
తాజాగా స్లీవ్‌లెస్ జాకెట్, ట్రెడిషనల్ వేర్‌లో అందాల విందు చేస్తూ స్రవంతి షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.