Ghee : డయాబెటిస్ ఉన్నవారు నెయ్యి తినవచ్చా? బ్లడ్ షుగర్ కంట్రోల్‌కు సూపర్ టిప్స్
డయాబెటిస్‌లో నెయ్యి అపోహలు
మధుమేహం ఉన్నవారు నెయ్యి తింటే బరువు, షుగర్ పెరుగుతాయని అనుకుంటారు. కానీ పరిమిత మోతాదులో తీసుకుంటే ఇది బ్లడ్ షుగర్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.
షుగర్ పెరగకుండా అడ్డుకుంటుంది!
అన్నం లేదా రొట్టెల్లో కొద్దిగా నెయ్యి వేసుకోవడం వల్ల జీర్ణక్రియ రేటు నెమ్మదిస్తుంది. దీనివల్ల రక్తంలోకి గ్లూకోజ్ ఒకేసారి కాకుండా క్రమంగా విడుదలవుతుంది.
ఇన్సులిన్ పనితీరు మెరుగుపడుతుంది!
ఆవు నెయ్యిలో ఉండే లినోలెయిక్ యాసిడ్ శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి, డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది.
పేగుల ఆరోగ్యానికి బూస్టర్!
నెయ్యిలో లభించే బ్యూటిరిక్ యాసిడ్ జీర్ణవ్యవస్థను, పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియ వల్ల చక్కెర జీవక్రియ బాగుంటుంది.
నెయ్యి + పసుపు కాంబినేషన్!
ఉదయాన్నే ఒక టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన నెయ్యిలో కొద్దిగా పసుపు పొడి కలిపి తీసుకోవడం వల్ల లోపలి ఇన్ఫ్లమేషన్ తగ్గి, బ్లడ్ షుగర్ నియంత్రణలోకి వస్తుంది.
రోజువారీ మోతాదు ఎంత?
మధుమేహం ఉన్నవారు రోజుకు 1 నుంచి 2 టీస్పూన్ల నెయ్యి మాత్రమే తీసుకోవాలి. పరిమితి దాటితే శరీరంలో క్యాలరీలు, సంతృప్త కొవ్వులు ఎక్కువవుతాయి.
ఎలా తీసుకోవాలి?
మధ్యాహ్నం వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి కలుపుకోవడం లేదా రాత్రి తినే చపాతీలపై తేలికగా రాసుకుని తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
ఇంట్లో తయారుచేసిన నెయ్యే బెస్ట్!
మార్కెట్లో దొరికే రసాయనాలు కలిసిన ప్యాకెట్ నెయ్యి కంటే, ఇంట్లో సాంప్రదాయ పద్ధతిలో తయారుచేసిన స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఎంచుకోవడం చాలా ముఖ్యం.
అతిగా తింటే ముప్పే!
నెయ్యి మంచిదే కదా అని ఎక్కువగా తింటే బరువు పెరగడం, శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.
నిపుణుల సలహా తప్పనిసరి!
నెయ్యి అనేది డయాబెటిస్ మందులకు ప్రత్యామ్నాయం కాదు. కాబట్టి మీ డైట్‌లో నెయ్యిని చేర్చుకునే ముందు ఒకసారి మీ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించడం మంచిది.