న్యూజిలాండ్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ ఆక్లాండ్‌లో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 49 బంతుల్లో 107 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
నితీశ్ ఓవర్‌లో 32 పరుగులు!
ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో నితీశ్ కుమార్ రెడ్డిని ఫిలిప్స్ టార్గెట్ చేశాడు. ఒక్క ఓవర్‌లో 32 పరుగులు. ఒక బౌండరీ, నాలుగు సిక్సర్లతో న్యూజిలాండ్ స్కోరు ఒక్కసారిగా దూసుకెళ్లింది.
మొదటి బంతి..
ఓవర్ తొలి బంతికి మైకేల్ బ్రేస్‌వెల్ ఒక పరుగు తీసుకున్నాడు. నితీశ్ ఆరంభం బాగానే కనిపించింది. కానీ ఆ తర్వాత ఫిలిప్స్ విధ్వంసం మొదలైంది.
నోబాల్.. ఫోర్!
రెండో బంతికి నితీశ్ వేసింది నడుము ఎత్తులో నోబాల్. ఫ్రీ హిట్‌కు ముందు వచ్చిన బంతినే ఫిలిప్స్ లెగ్‌సైడ్‌లోకి బౌండరీగా పంపాడు. నోబాల్ + ఫోర్ = 5 పరుగులు!
ఫ్రీ హిట్‌లో 2 పరుగులు
ఫ్రీ హిట్ బంతిని నితీశ్ వైడ్ యార్కర్‌గా వేయాలని ప్రయత్నించాడు. ఫిలిప్స్ బ్యాక్‌వర్డ్ పాయింట్ వైపు ఆడాడు. కివీస్ రెండు పరుగులు పూర్తి చేశారు.
సిక్సర్ల వర్షం!
మూడో బంతికి నితీశ్ యార్కర్‌ను మిస్ చేశాడు. అంతే.. ఫిలిప్స్ ఎక్స్‌ట్రా కవర్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. ఓవర్‌లో తొలి సిక్స్!
రెండో సిక్స్.. 63 మీటర్లు!
నితీశ్ మరోసారి ఫుల్ లెంగ్త్ బంతి వేశాడు. ఫిలిప్స్ దాన్ని లాంగ్ ఆన్ దిశగా భారీగా కొట్టాడు. 63 మీటర్ల సిక్స్!
మూడో సిక్స్..!
నితీశ్ ఓవర్ ది వికెట్ నుంచి బంతి వేశాడు. ఫిలిప్స్ మరోసారి గట్టిగా స్వింగ్ చేశాడు. టాప్ ఎడ్జ్ వచ్చినా బంతి బౌండరీ దాటి సిక్సర్‌గా మారింది.
నాలుగో సిక్స్‌తో ఓవర్ ముగింపు!
చివరి బంతికి కూడా నితీశ్ యార్కర్‌ను సరిగ్గా వేయలేకపోయాడు. ఫిలిప్స్ లాంగ్ ఆఫ్ మీదుగా మరో సిక్సర్ బాదాడు. దీంతో వరుసగా నాలుగు సిక్సర్లు వచ్చాయి.
చెత్త రికార్డు జాబితాలో నితీశ్!
ఒక్క ఓవర్‌లో 32 పరుగులు ఇచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి, భారత బౌలర్లలో ఈ జాబితాలో చేరాడు. శివమ్ దూబే – 34 పరుగులు, స్టువర్ట్ బిన్నీ – 32 పరుగులు, నితీశ్ కుమార్ రెడ్డి – 32 పరుగులు.