17 మ్యూచువల్ ఫండ్ సంస్థల నిర్ణయం

ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, కోటక్ వంటి సంస్థలు కొత్త సబ్‌స్క్రిప్షన్లను తాత్కాలికంగా నిలిపివేశాయి.
గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏమిటి?
సాధార‌ణంగా ఈ పథకాలు నేరుగా బంగారం కొనుగోలు చేయకుండా, గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెడతాయి.
సిల్వర్ ఫండ్లపైనా ఆంక్షలు
కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు గోల్డ్ ఫండ్లతో పాటు సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్స్‌లోనూ కొత్త పెట్టుబడులను నిలిపివేశాయి.
కొత్త పెట్టుబడిదారులకు ఇబ్బందులు
ఈ సస్పెన్షన్ అమల్లో ఉన్నంతకాలం సంబంధిత పథకాలలో కొత్తగా పెట్టుబడులు పెట్టడం లేదా కొత్త సబ్‌స్క్రిప్షన్లు ప్రారంభించడం సాధ్యం కాదు.
SIP రిజిస్ట్రేషన్లకు బ్రేక్
కొత్త SIPలు, STPలు, పెద్ద మొత్తంలో పెట్టుబడులు, ఇతర పథకాల నుంచి నిధుల బదిలీలపై కూడా ఆంక్షలు వర్తించనున్నాయి.
ఇప్పటికే పెట్టుబడి పెట్టిన వారికి ఊరట
ప్రస్తుత పెట్టుబడులను ఉపసంహరించుకోవడం, పథకం నుంచి బయటకు రావడం వంటి వెసులుబాట్లు కొనసాగుతాయని సంస్థలు తెలిపాయి.
తదుపరి ప్రకటన వరకు నిలిపివేత
కొత్త పెట్టుబడుల స్వీకరణపై విధించిన ఆంక్షలు తదుపరి నోటీసు ఇచ్చేవరకు కొనసాగుతాయని ఫండ్ సంస్థలు వెల్లడించాయి.
పండగల సమయంలోనే ఎందుకీ నిర్ణయం?
ధనత్రయోదశి, దీపావళి సమయంలో బంగారం, వెండి కొనుగోళ్లు పెరగడం సాధారణం. ఈ సమయంలోనే పెట్టుబడులపై ఆంక్షలు విధించడం చర్చనీయాంశంగా మారింది.
సెబీ ఆదేశాలపై మార్కెట్ వర్గాల అంచనా
ఈ నిర్ణయం వెనుక సెబీ ఆదేశాలు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే, సంస్థలు నిర్దిష్ట కారణాలను వెల్లడించలేదు.
గోల్డ్ ఈటీఎఫ్లలో పెరిగిన పెట్టుబడులు
యాంఫీ గణాంకాల ప్రకారం, సెప్టెంబరులో గోల్డ్ ఈటీఎఫ్లలోకి నికరంగా రూ.4,450 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు ఆగస్టులో ఈ మొత్తం రూ.2,597 కోట్లుగా ఉంది.