తక్షణ శక్తి, ఎలక్ట్రోలైట్లు

కొబ్బరినీళ్లలో 94% కంటే ఎక్కువ నీటిశాతం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం ఉంటాయి. ఉదయాన్నే ఇవి శరీరానికి తక్షణ ఎలక్ట్రోలైట్లను అందిస్తాయి.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది
కొబ్బరినీళ్లలోని సహజ ఎంజైమ్‌లు జీర్ణవ్యవస్థను వేగవంతం చేసి, రోజంతా జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేస్తాయి.
ఎసిడిటీ, గ్యాస్ నుంచి ఉపశమనం
పరగడుపున తాగడం వల్ల కడుపులో మంట, ఎసిడిటీ, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు త్వరగా నయమవుతాయి.
బీపీ నియంత్రణ
పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో సోడియం శాతాన్ని సమతుల్యం చేసి అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
గుండె ఆరోగ్యం
క్రమం తప్పకుండా ఉదయాన్నే కొబ్బరినీళ్లు తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగై గుండె ఆరోగ్యం రక్షించబడుతుంది.
విషపదార్థాల తొలగింపు
ఇది సహజమైన డైయూరెటిక్‌గా పనిచేసి, మూత్రం ద్వారా శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్లను బయటకు పంపుతుంది.
కిడ్నీ రాళ్ల నివారణ
మూత్రపిండాలను శుభ్రపరచి, కిడ్నీలలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
కాంతివంతమైన చర్మం
యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని లోపలి నుంచి తేమగా ఉంచి, ఎండ దెబ్బ నుంచి కాపాడుతూ ముఖానికి సహజ గ్లో ఇస్తాయి.
కెఫిన్‌కి మంచి ప్రత్యామ్నాయం
ఎలాంటి ఆర్టిఫిషియల్ షుగర్స్ లేని సహజ గ్లూకోజ్ లభించడం వల్ల ఉదయం తాగే కెఫిన్ ఉన్న టీ, కాఫీలకు ఇది సరైన హెల్తీ ఆల్టర్నేటివ్.
ఎంత మోతాదులో తాగాలి?
ఎల్లప్పుడూ తాజా కొబ్బరినీళ్లను గది ఉష్ణోగ్రత వద్ద మాత్రమే తాగాలి. రోజుకు 200 ml నుండి 500 ml వరకు తాగడం శ్రేయస్కరం.