అస్తవ్యస్త జీవనశైలి:

జంక్ ఫుడ్, వేళ తప్పిన భోజన అలవాట్లు ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రోటీన్ల సమ్మేళనం:
ఒక గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాలకు బలాన్ని, శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తుంది.
ఉదయం యాక్టివ్‌గా:
టిఫిన్‌లో ఉడకబెట్టిన గుడ్డు తింటే రోజంతా ఉత్సాహంగా పని చేయవచ్చు, అలసట అనేది అస్సలు దరిచేరదు.
కాలేయ ఆరోగ్యం:
గుడ్డులోని 'కోలిన్' కణాల పనితీరును మెరుగుపరుస్తుంది, కాలేయాన్ని రక్షించి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
మెదడు, జ్ఞాపకశక్తి:
కోలిన్ వల్ల ఉత్పత్తి అయ్యే 'అసిటైల్ కోలిన్' మెదడును చురుగ్గా ఉంచి, జ్ఞాపకశక్తిని బాగా పెంచుతుంది.
మెరుగైన కంటిచూపు:
ఇందులోని లుటీన్, జియాజాంతిన్ ఆంటిఆక్సిడెంట్లు కంటి శుక్లాలు రాకుండా చూపును మెరుగుపరుస్తాయి.
రోగనిరోధక శక్తి:
కోడిగుడ్డులో ఉండే 'సెలీనియం' శరీర ఇమ్యూనిటీని పెంచి, సీజనల్ వ్యాధుల నుండి కాపాడుతుంది.
సాధారణ వ్యక్తులకు:
పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు రోజూ 1 నుండి 2 ఉడకబెట్టిన గుడ్లను నిరభ్యంతరంగా తినవచ్చు.
గుండె బాధితులకు:
గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు వైద్యుల సలహాతో కేవలం తెల్లసొన మాత్రమే తినాలి.
వ్యాయామం చేసేవారికి:
రోజూ కఠినమైన వ్యాయామం, శారీరక శ్రమ చేసేవారు శరీర దారుఢ్యం కోసం 2 నుండి 4 గుడ్లు తినవచ్చు.