ఆయుర్వేద, రక్తాభివృద్ధి మేలు

వాత, కఫ దోషాలను తొలగిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసి రక్తకణాల ఉత్పత్తిని, ప్రసరణను మెరుగుపరుస్తుంది.
గుండెకు సంపూర్ణ రక్షణ
పాలీఫెనల్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. బిపి, హైపర్ టెన్షన్ తగ్గుతాయి.
మెరుగైన జీర్ణ వ్యవస్థ
గుప్పెడు గింజలు కడుపులో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. గాల్‌బ్లాడర్ పనితీరును మెరుగుపరచి జీర్ణక్రియకు తోడ్పడతాయి.
తక్షణ శక్తి, ఎనర్జీ బూస్ట్
రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచి, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ప్రాణాంతక రోగాలను నివారిస్తుంది.
కాంతివంతమైన చర్మ సౌందర్యం
విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్, మచ్చలు, గీతలను నివారిస్తాయి.
డయాబెటిస్ నియంత్రణ
గ్లైసెమిక్ సూచీ తక్కువగా ఉండటం వల్ల ఇన్సులిన్ నిరోధకతను తగ్గించి, షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తుంది.
శోధ నిరోధక గుణాలు
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ఆక్సిడేటివ్ స్ట్రెస్ నిరోధక గుణాలు శరీరంలోని వాపులను, కణాల డామేజ్‌ను అరికడతాయి.
మెదడు చురుకుదనం
మెదడు వాపును తగ్గించి, ఆల్జీమర్స్ బారిన పడకుండా కాపాడుతుంది. అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది.
వ్యాధి నిరోధక శక్తి
ఇందులోని విటమిన్ సీ జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు, వైరస్‌లు, బ్యాక్టీరియాలతో పోరాడుతుంది.
ఉదయం హైడ్రేషన్
అధిక నీటి శాతం ఉండటం వల్ల ఉదయాన్నే శరీరానికి మరియు చర్మానికి కావాల్సిన మంచి హైడ్రేషన్ లభిస్తుంది.