తక్కువ కేలరీలు, నీరు, ఫైబర్ అధికంగా ఉండే కర్బూజ బరువు తగ్గాలనుకునే వారికి గొప్ప చిరుతిండి. ఇది మీ కడుపు నిండుగా చేసి, అతిగా తినడం తగ్గించడంలో సాయపడుతుంది.
కిడ్నీ స్టోన్స్ నివారణ:
కర్బూజ వాటర్ రిచ్ ఫ్రూట్. ఇది శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపి, కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కంటి ఆరోగ్యం:
కర్బూజలోని బీటా-కెరోటిన్ శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. దృష్టిని మెరుగుపరుస్తుంది. వయోసంబంధిత కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మలబద్దకం:
కర్బూజలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది ప్రేగుల్లో ఆహారం కదలికలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఇతర జీర్ణ సమస్యలను నివారిస్తుంది.
హైడ్రేటెడ్ గా ఉంచుతుంది:
దాదాపు 90 శాతం వాటర్ కంటెంట్ తో ఉండే కర్బూజ పండ్లు మిమ్మల్ని హైడ్రేట్ గాఉంచడంలో సహాయపడతాయి. డీహైడ్రేషన్ ఎక్కువగా ఉన్న చల్లని వాతావరణంలో కర్బూజ ఉపయోగకరంగా ఉంటుంది.
మధుమేహం:
కర్బూజలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మధుమేహం ఉన్న వారికి రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి ఇవి మంచి ఎంపిక.
బీపీ:
పొటాషియం, పీచు, నీరు సమృద్ధిగా ఉండే కర్బూజ రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
రోగ నిరోధక శక్తి:
కర్బూజలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. మీ శరీరం ఇన్ఫెక్షన్ల, అనారోగ్యాలతో పోరాడటానికి సహాయపడుతుంది.
ఒత్తిడి:
కర్బూజలో మెగ్నీషియం ఉంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను నిర్వహించడానికి సహాయపడుతుంది.
ఆరోగ్యకరమైన చర్మం:
విటమిన్ సి, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన కర్బూజ చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి. వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన, మెరిసే చర్మపు రంగును ప్రోత్సహిస్తుంది.