Cucumber : కీరదోసకాయ అమృతమే.. కానీ వీరు తింటే మాత్రం డేంజర్
జీర్ణ సమస్యలు
కీరదోసకాయలో ఉండే పీచు పదార్థాలు, సహజ రసాయనాలు సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారికి పడవు. దీనివల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి.
చేదు కీరదోసతో డేంజర్
కీరదోసకాయ తింటున్నప్పుడు కొన్నిసార్లు విపరీతమైన చేదు రుచి తెలుస్తుంది. దీనికి అందులో ఉండే కుకుర్ బిటానిన్స్ అనే సహజ రసాయనాలే కారణం.
వికారం, వాంతులు
మరీ చేదుగా ఉన్న కీరదోసకాయను తింటే వికారం, వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పి, విరేచనాల బారిన పడే ప్రమాదం ఉంది. చేదుగా అనిపిస్తే వెంటనే పక్కన పారేయాలి.
ఫుడ్ పాయిజనింగ్ ముప్పు
మిగతా పచ్చి కూరగాయల తరహాలోనే కీరదోసకాయలపై కూడా హానికర బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. సరిగా కడగకుండా తింటే జ్వరం, వాంతులు, ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది.
అలర్జీ లక్షణాలు
చాలా అరుదుగా కొందరిలో కీరదోసకాయ వల్ల అలర్జీ వస్తుంది. నోరు, గొంతులో దురద రావడం, పెదవులు లేదా నాలుక వాపు, చర్మంపై దద్దుర్లు వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.
అతిగా మూత్ర విసర్జన
కీరదోసలో దాదాపు 95% నీరే ఉంటుంది. అందువల్ల దీనిని మోతాదుకు మించి తింటే సాధారణం కంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
ఉప్పు నీటితో కడగాలి
కీరదోసకాయను తినే ముందు ఉప్పు నీటితో లేదా మంచినీటితో బాగా కడిగి, శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దానిపై ఉన్న బ్యాక్టీరియా, కెమికల్స్ తొలగిపోతాయి.
తొక్క తీసి తినడం మేలు
జీర్ణకోశ సమస్యలు, గ్యాస్ ఇబ్బందులు ఉన్నవారు కీరదోసకాయను తొక్క తీసి తింటే సులభంగా జీర్ణమవుతుంది. ఇది కడుపుకు హాయిని ఇస్తుంది.
మితంగానే తినాలి
అమృతమైనా మితంగానే ఉండాలి. సలాడ్స్ రూపంలో తీసుకున్నప్పుడు రోజుకు ఒకటి లేదా అర ముక్క మాత్రమే తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
భద్రపరిచే విధానం
మార్కెట్ నుండి తెచ్చిన కీరదోసకాయలను ఎప్పుడూ అపరిశుభ్రమైన ప్రదేశాల్లో ఉంచకూడదు. వాటిని శుభ్రమైన, చల్లని ప్రదేశంలో లేదా ఫ్రిజ్‌లో మాత్రమే భద్రపరచాలి.