హోంశాఖ అడ్వైజరీ

వాట్సాప్ వెబ్ వాడకంపై కేంద్ర హోంశాఖ అడ్వైజరీ జారీ చేసింది. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
గుర్తించిన సంస్థలు
NCTAU, I4C సంస్థలు వెబ్ లాగిన్ ద్వారా వాట్సాప్ అకౌంట్ మిస్ యూజ్ అవుతున్నట్లు గుర్తించాయి.
అనధికార యాక్సెస్
అనధికార యాక్సెస్‌తో మెసేజ్‌లు చదవడం, అకౌంట్ హోల్డర్ పేరుతో మెసేజ్‌లు పంపడం, కాంటాక్ట్స్, గ్రూప్ చాట్‌లు చూడటం జరగొచ్చు.
మోసాల ముప్పు: టెక్స్ట్
ఈ యాక్సెస్‌తో ఫ్రాడ్, ఫిషింగ్, సోషల్ ఇంజినీరింగ్ వంటి నేరాలు జరిగే అవకాశం ఉందని హోంశాఖ హెచ్చరించింది.
సెన్సిటివ్ వర్క్ వద్దు
ప్రభుత్వ, సంస్థ, ఆర్థిక, గోప్యమైన సమాచారాన్ని కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ ద్వారా పంపకపోవడమే మంచిదని సూచించింది.
లాగిన్‌లో ఉంచొద్దు
అవసరం లేనప్పుడు వాట్సాప్ వెబ్ సెషన్‌ను యాక్టివ్‌గా ఉంచొద్దు. ఆఫీస్, షేర్డ్ కంప్యూటర్లలో ఇది మరింత ప్రమాదకరం.
తప్పనిసరిగా Logout
పని పూర్తయ్యాక మాన్యువల్‌గా Logout చేయాలి. బ్రౌజర్ విండో లేదా ట్యాబ్ మూసివేయడాన్ని లాగ్ అవుట్‌గా భావించొద్దు.
Incognito మోడ్
తప్పనిసరైతే నమ్మకమైన కంప్యూటర్‌లో Incognito/Private మోడ్ వాడాలి. బ్రౌజర్ మూసే ముందు మాన్యువల్‌గా లాగ్ అవుట్ చేయాలి.
పబ్లిక్ కంప్యూటర్లు వద్దు
సైబర్ కేఫ్‌లు, పబ్లిక్ కియోస్క్‌లు, హోటల్ బిజినెస్ సెంటర్లు, అరువు తెచ్చిన కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ లాగిన్ కావొద్దు.
అలర్ట్‌గా ఉండండి
అకౌంట్ నుంచి అనుకోని మెసేజ్‌లు, కాంటాక్ట్స్ నుంచి వింత రిప్లైలు వస్తే సీరియస్‌గా తీసుకోండి. డివైజ్, బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయండి.