థియేటర్ ఎక్స్‌పీరియన్స్:

తక్కువ బడ్జెట్ ప్రొజెక్టర్లతో ఇంట్లోనే థియేటర్ వైబ్ పొందవచ్చు.
స్విచ్ ఆఫ్ ప్లగ్గింగ్:
ఆఫ్ చేసిన వెంటనే ప్లగ్ తీయకుండా ఫ్యాన్ ఆగేదాకా ఆగాలి.
హీట్ వెెంటిలేషన్:
ఫ్యాన్ పూర్తిగా తిరిగితేనే లోపలి వేడి బయటకు పోతుంది.
ఇరుకు ప్రదేశాలు:
కప్‌బోర్డులు లేదా ఇరుకైన చోట్ల ప్రొజెక్టర్ పెట్టకూడదు.
ఎయిర్ ఫ్లో:
గాలి సరిగా ఆడకపోతే ఓవర్ హీట్ అయి ప్రొజెక్టర్ ఆఫ్ అవుతుంది.
వెంట వెంటనే కదపడం:
సినిమా పూర్తయిన వెంటనే ప్రొజెక్టర్‌ను షిఫ్ట్ చేయకూడదు.
కూలింగ్ టైమ్:
వేడి తగ్గేవరకు 5 నుండి 10 నిమిషాలు కదల్చకుండా ఉంచాలి.
డస్ట్ క్లీనింగ్:
ఫిల్టర్లలో దుమ్ము చేరితే ఎయిర్ ఫ్లో తగ్గి వేడెక్కుతుంది.
పిక్చర్ క్వాలిటీ:
లెన్స్‌పై దుమ్ము పడితే డిస్‌ప్లే క్వాలిటీ తగ్గిపోతుంది.
లైఫ్ టైమ్:
ఎయిర్ ఫిల్టర్లను రెగ్యులర్‌గా క్లీన్ చేస్తే ప్రొజెక్టర్ ఎక్కువ కాలం వస్తుంది.