వేడినీటి స్నానం చేస్తున్నారా

చలికాలంలో వేడినీటితో స్నానం చేయడం ఇష్టపడేవారికి వైద్యులు కీలక హెచ్చరిక జారీ చేశారు. ఈ అలవాటు వల్ల వచ్చే సమస్యలు ఇవే.
మరీ వేడిగా వద్దు
చలికాలంలో మరీ వేడినీటితో స్నానం చేస్తే ఆరోగ్యానికి హాని కలుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
సహజ నూనెలు తొలగిపోతాయి
వేడినీటితో స్నానం చేస్తే చర్మంపై ఉండే సహజ నూనెలు తొలగిపోతాయి. చర్మాన్ని రక్షించే ఈ పొర దెబ్బతింటుంది.
చర్మం పొడిబారుతుంది
సహజ నూనెలు పోవడంతో చర్మం పొడిబారి దురద కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
తలపై వేడినీళ్లు వద్దు
తలపై వేడి నీళ్లు పోసుకోవడం వల్ల స్కాల్ప్ డ్రై అవుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
జుట్టు మూలాలు బలహీనం
స్కాల్ప్ డ్రై అయితే జుట్టు మూలాలు బలహీనపడతాయి. దీంతో చుండ్రు, జుట్టు రాలే సమస్య పెరుగుతుంది.
ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరుగుతుంది
వేడినీటి స్నానంతో శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరుగుతుందని వైద్యులు తెలిపారు.
రక్తనాళాలపై ఒత్తిడి
శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగితే రక్తనాళాలపై ఒత్తిడి పడుతుందని వైద్యులు చెబుతున్నారు.
బీపీ పెరిగే ఆస్కారం
రక్తనాళాలపై ఒత్తిడి పడటంతో బీపీ పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
గోరువెచ్చని నీరే మేలు
స్నానానికి గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలని వైద్యులు సూచిస్తున్నారు.