కార్డ్‌లో ఉండే ప్రాథమిక సమాచారం:

ఏటీఎం లేదా డెబిట్ కార్డ్ పైన మీ పేరు, 16 అంకెల కార్డ్ నంబర్, ఎక్స్‌పైరీ డేట్, సివివి నంబర్ వంటి వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి.
చిప్, మ్యాగ్నెటిక్ స్ట్రిప్‌లో రహస్య డేటా:
కార్డ్ పైన ఉండే సమాచారంతో పాటు, దాని వెనుక ఉండే నల్లటి మ్యాగ్నెటిక్ స్ట్రిప్ లేదా ముందు ఉండే ఇఎంవి చిప్‌లో బ్యాంక్ కోడ్స్, సెక్యూరిటీ వివరాలు సేవ్ అయి ఉంటాయి.
కార్డ్‌లో బ్యాంక్ బ్యాలెన్స్ సేవ్ అవ్వదు:
చాలామంది అనుకున్నట్లుగా కార్డ్‌లో మీ ఖాతా బ్యాలెన్స్ లేదా పూర్తి బ్యాంక్ స్టేట్‌మెంట్ వివరాలు ఏవీ సేవ్ కావు.
మ్యాగ్నెటిక్ స్ట్రిప్ టెక్నాలజీ:
పాత ఏటీఎం కార్డుల వెనుక ఉండే నల్లటి పట్టీలో మ్యాగ్నెటిక్ రూపంలో డేటాను రికార్డ్ చేసేవారు. స్వైప్ చేసినప్పుడు మెషిన్ ఈ డేటాను స్కాన్ చేస్తుంది.
ఈఎమ్‌వి చిప్ విప్లవం:
నేటి ఆధునిక కార్డులలో ఉండే చిన్న బంగారు రంగు చిప్ ఒక చిన్న కంప్యూటర్‌లా పనిచేస్తుంది. ఇది అత్యంత సురక్షితమైనది.
యూనిక్ సెక్యూరిటీ కోడ్ ఉత్పత్తి:
ఈఎమ్‌వి చిప్ కార్డ్ ద్వారా ప్రతి లావాదేవీ జరిగినప్పుడల్లా ఒక కొత్త, సురక్షితమైన సెక్యూరిటీ కోడ్‌ను క్రియేట్ చేస్తుంది.
మెషిన్ గుర్తింపు ప్రక్రియ:
మీరు ఎటిఎమ్‌లో కార్డ్ ఇన్సర్ట్ చేయగానే మెషిన్ ముందుగా చిప్‌ను స్కాన్ చేసి, ఆ డేటాను వెంటనే మీ బ్యాంక్ సర్వర్‌కు పంపుతుంది.
సర్వర్ వెరిఫికేషన్:
బ్యాంక్ సర్వర్ సదరు కార్డ్ వ్యాలిడిటీని, అది యాక్టివ్‌గా ఉందో లేదో సరిచూసి, ఆపై పిన్ నమోదు చేయమని సూచిస్తుంది.
పిన్ ఎన్‌క్రిప్షన్ :
మీరు ఎంటర్ చేసిన 4 అంకెల పిన్ సంఖ్య ఎన్‌క్రిప్ట్ (కోడ్ భాషలోకి) అయి బ్యాంక్ సర్వర్‌కు వెళ్తుంది. సర్వర్ రికార్డ్‌తో మ్యాచ్ అయితేనే ప్రాసెస్ ముందడుగు వేస్తుంది.
మల్టీ-లేయర్ సెక్యూరిటీ:
ఎన్‌క్రిప్షన్, ఇఎంవి చిప్, పిన్ వెరిఫికేషన్, రియల్-టైమ్ సర్వర్ కనెక్టివిటీల వల్ల కార్డ్ క్లోనింగ్ మరియు ఆన్‌లైన్ మోసాల ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.