Google: మనం రోజువారీ జీవితంలో ఏదైనా సమాచారం వెతకాలన్నా, వీడియోలు చూడాలన్నా ముందుగా గుర్తుకు వచ్చేది గూగుల్ మరియు యూట్యూబ్. ఈ సేవలను మనం పూర్తిగా ఉచితంగానే వాడుకుంటున్నాం. మరి ఎలాంటి ఛార్జీలు తీసుకోకుండానే గూగుల్ సంస్థ అంత భారీ స్థాయిలో వేల కోట్ల రూపాయలను ఎలా సంపాదిస్తోంది? దాని వెనుక ఉన్న అసలు వ్యాపార రహస్యాలు, ఆదాయ వనరుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.