మీ బ్యాంక్ ఖాతాకు UPI PIN ఏర్పాటు చేసుకోవడానికి రెండు పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. డెబిట్ కార్డ్ వివరాలు లేదా ఆధార్ ఆధారిత OTP ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ఆధార్‌తో మొబైల్ నంబర్ లింక్ చేయాలి
డెబిట్ కార్డ్ ఉపయోగించకుండా పిన్ క్రియేట్ చేయాలంటే మీ ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. OTP ధ్రువీకరణకు ఇది తప్పనిసరి.
బ్యాంక్ ఖాతాకు నంబర్ రిజిస్టర్ కావాలి
మీరు ఉపయోగిస్తున్న మొబైల్ నంబర్ బ్యాంక్ ఖాతాకు కూడా లింక్ అయి ఉండాలి. ఆధార్, బ్యాంక్ రికార్డుల్లోని నంబర్లు సరిపోలినప్పుడే OTP వెరిఫికేషన్ సాధ్యమవుతుంది.
మీ UPI యాప్‌ను ఓపెన్ చేయండి
ముందుగా ఫోన్లో ఉన్న UPI యాప్‌ను తెరిచి, మీ బ్యాంక్ ఖాతాను అందులో జోడించండి. ఇప్పటికే ఖాతా అనుసంధానమై ఉంటే నెక్ట్స్ స్టెప్‌కి వెళ్లవచ్చు.
ఆధార్ వెరిఫికేషన్ ఆప్షన్ ఎంచుకోండి
UPI PIN సెట్ చేసే విభాగంలోకి వెళ్లగానే డెబిట్ కార్డ్, ఆధార్ అనే రెండు ఎంపికలు కనిపిస్తాయి. వాటిలో ఆధార్ ద్వారా పిన్ ఏర్పాటు చేసుకునే ఆప్షన్‌ను ఎంచుకోండి.
ఆధార్ నంబర్ నమోదు చేయండి
అడిగిన చోట మీ ఆధార్ నంబర్లోని మొదటి ఆరు అంకెలను నమోదు చేయాలి. నిబంధనలను చదివి సమ్మతి తెలిపిన తర్వాత ధ్రువీకరణ ప్రక్రియను కొనసాగించండి.
OTPతో వివరాలను ధ్రువీకరించండి
ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు UIDAI నుంచి OTP వస్తుంది. అలాగే బ్యాంక్ పంపించే OTPను కూడా నమోదు చేసి ధ్రువీకరణ పూర్తి చేయాలి.
కొత్త UPI PIN క్రియేట్ చేసుకోండి
అన్ని వివరాలు సరిగ్గా ధ్రువీకరణ అయిన తర్వాత కొత్త UPI PINను నమోదు చేయండి. మరోసారి అదే పిన్ను ఎంటర్ చేసి నిర్ధారిస్తే మీ బ్యాంక్ ఖాతాకు UPI PIN ఏర్పాటు పూర్తవుతుంది.