మెటా ఎఐ డేటా యూసేజ్:

యూజర్లు చూసే కంటెంట్, యాక్టివిటీ ఆధారంగా మెటా తన ఎఐ మోడళ్లను ట్రైన్ చేస్తోంది.
యాడ్స్ కోసం సమాచారం:
ఇతర కంపెనీల నుంచి వచ్చే మీ డేటాను టార్గెటెడ్ ప్రకటనల కోసం మెటా వాడుతుంది.
'యాక్టివిటీ ఫ్రమ్ అదర్ బిజినెసెస్':
ఈ ఫీచర్ ద్వారా వేరే యాప్స్ నుంచి మీ డేటా మెటాకు వెళ్లకుండా నిరోధించవచ్చు.
ఇన్‌స్టాలో సెట్టింగ్స్ చేంజ్:
ఇన్స్టా ప్రొఫైల్‌లోని 'Accounts Center' లో 'Activity from other businesses' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
యాడ్ ప్రిఫరెన్సెస్ తనిఖీ:
కొన్ని అకౌంట్లలో 'Ad preferences' లో 'Activity information from ad partners' ని డిసేబుల్ చేయాలి.
ఐఫోన్ ప్రైవసీ సెట్టింగ్స్:
iPhone యూజర్లు Settings > Privacy & Security > Tracking లోకి వెళ్లి ఇన్‌స్టాగ్రామ్ ట్రాకింగ్‌ను ఆపాలి.
ఆండ్రాయిడ్ యాప్ పర్మిషన్లు:
Android ఫోన్లలో Settings > Apps > Instagram లో అనవసరమైన పర్మిషన్లన్నింటినీ ఆఫ్ చేయాలి.
ఎఐతో చాటింగ్ జాగ్రత్త:
మెటా ఎఐతో మాట్లాడేటప్పుడు మీ పర్సనల్ సమాచారాన్ని ఎక్కువగా షేర్ చేయకూడదు.
డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయొద్దు:
ఆధార్, పాస్‌పోర్ట్ వంటి సున్నితమైన పత్రాలు లేదా రహస్య డేటాను ఎఐ చాట్‌లో పంపవద్దు.
థర్డ్ పార్టీ ట్రాకింగ్ బంద్:
ఈ సెట్టింగ్స్ మార్చడం ద్వారా ఇతర వెబ్‌సైట్లలో మీ ప్రవర్తనను ఇన్‌స్టాగ్రామ్ ట్రాక్ చేయకుండా అడ్డుకోవచ్చు.