ఈ ఫుడ్స్ తింటే ఎక్కువ రోజులు జీవిస్తారట

మీరు ఆరోగ్యంగా,ఎక్కువ రోజులు జీవించాలంటే ఆహారంపై శ్రద్ద వహించడం ముఖ్యం. పోషకాలు అధికంగా ఉండే ఈ ఫుడ్స్ తింటే ఎక్కువరోజులు జీవిస్తారట.
గింజలు
గింజలు పోషకాహారానికి మంచి మూలం. రోజూ కొన్ని డ్రైఫ్రూట్స్ తింటే మీ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
లీఫీ గ్రీన్స్
ఆకుకూరలు, బచ్చలి, కాలే, పాలకూర వంటివి అభిజ్నా క్షీణతను నెమ్మదిస్తాయి. మీ డైట్లో ఆకుకూరలు చేర్చుకుంటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.
చిక్కుళ్ళు
మీరు ఎక్కువ కాలం జీవించాలనుకుంటే పప్పుధాన్యాలు మీ డైట్లో భాగం చేసుకోండి. వీటిలో ప్రొటీన్, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది.
ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. అల్జీమర్స్, గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
పండ్లు
ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్, సహజ చక్కెరలు పండ్లలో ఉంటాయి. పండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి సానుకూల ప్రభావం ఉంటుంది. తాజా పండ్లు ఇమ్యూనిటీని పెంచుతాయి.