జీఎస్‌బీ సేవా మండల్ మహాగణపతి – ముంబై
ముంబైలోని కింగ్స్ సర్కిల్‌లో కొలువయ్యే GSB సేవా మండల్ మహాగణపతి దేశంలో అత్యంత విలువైన పబ్లిక్ గణపతుల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. 2026 ఉత్సవాల కోసం ఈ గణపతికి ఏకంగా రూ. 703.27 కోట్ల బీమా కవరేజీ ఉండటం ప్రత్యేక ఆకర్షణ. విగ్రహానికి 66 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు, 335 కిలోల వెండి, విలువైన రత్నాలతో అలంకరణ చేస్తారు.