Instagram: ఇన్‌స్టాలో ఫోటోలు, వీడియోలు పోతాయనే టెన్షన్ ఉందా? ఇలా చేయండి చాలు..
ప్రొఫైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయడం:
మొబైల్‌లో ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ పేజీకి వెళ్లాలి.
మెనూ ఆప్షన్ ఎంచుకోవడం:
కుడివైపు పైభాగంలో కనిపించే మూడు గీతల (Menu) ఐకాన్‌పై ట్యాప్ చేయాలి.
యువర్ యాప్ అండ్ మీడియా సెక్షన్:
అక్కడ ఉన్న సెట్టింగ్స్ ఆప్షన్‌లోకి వెళ్లి 'Your app and media' సెక్షన్‌ను కనుగొనాలి.
ఇన్ఫర్మేషన్ డౌన్‌లోడ్ ఆప్షన్:
ఆ సెక్షన్‌లో కిందకు స్క్రోల్ చేస్తే కనిపించే 'Download your information' ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
రిక్వెస్ట్ సబ్మిట్ చేయడం:
అక్కడ కనిపించే 'Request a download' బటన్‌పై ట్యాప్ చేసి మీ అకౌంట్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. కావలసిన డేటాను ఎంచుకోవడం, మీకు కావాల్సిన సమాచారాన్ని ఎంచుకోవాలి.
ఫార్మాట్, మెయిల్ ఎంట్రీ:
డేటా ఫార్మాట్‌ను ఎంచుకున్న తర్వాత మీ ఈమెయిల్ ఐడీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
పోస్ట్‌లను నేరుగా సేవ్ చేయడం:
మీ ఫోన్‌లో ఉన్న పాత ఫోటోలు లేదా వీడియోలను షేర్ బటన్ ద్వారా నేరుగా గ్యాలరీలోకి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
డేటా భద్రత:
ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకున్న ఫైల్‌ను మీ కంప్యూటర్ లేదా క్లౌడ్ స్టోరేజ్‌లో భద్రపరుచుకోవడం ద్వారా ఎప్పటికీ సురక్షితంగా ఉంటుంది.
Instagram:
లింక్ ద్వారా ఫైల్ పొందడం కొద్దిసేపటి తర్వాత ఇన్‌స్టాగ్రామ్ వారు మీ ఈమెయిల్‌కు డేటాను డౌన్‌లోడ్ చేసుకునే లింక్‌ను పంపుతారు.