ఐఫోన్‌తో హైకింగ్ ప్లాన్ :

యాపిల్ మ్యాప్స్‌లో మీకు నచ్చిన హైకింగ్ రూట్‌ను ముందుగానే క్రియేట్ చేసుకోవచ్చు.
కస్టమ్ రూట్ ఫీచర్ :
ఐఓఎస్ 18లో వచ్చిన క్రియేట్ కస్టమ్ రూట్ ఫీచర్‌తో సొంతంగా రూట్‌ను మ్యాప్ చేసుకోవచ్చు.
మ్యాప్స్ ఓపెన్ చేయండి :
ఐఫోన్‌లో మ్యాప్స్ యాప్‌ను ఓపెన్ చేసి, ప్రస్తుత లొకేషన్ లేదా కావాల్సిన ప్రదేశంలో పిన్ డ్రాప్ చేయాలి.
కస్టమ్ రూట్ ఎంచుకోండి :
కింద కనిపించే త్రీ డాట్స్ పై ట్యాప్ చేసి క్రియేట్ కస్టమ్ రూట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
రూట్‌ను మీరే డిజైన్ చేయండి :
మ్యాప్‌పై వివిధ ప్రదేశాలు, జంక్షన్లు, ల్యాండ్‌మార్క్‌లపై ట్యాప్ చేస్తూ మీకు కావాల్సిన రూట్‌ను రూపొందించుకోవచ్చు.
దూరం ఉన్న ప్రదేశానికీ రూట్ :
మీరు ఎంచుకున్న తదుపరి ప్రదేశం చాలా దూరంలో ఉన్నా, మ్యాప్స్ అక్కడికి వెళ్లే మార్గాన్ని ఆటోమేటిక్‌గా రూపొందిస్తుంది.
మూడు రూట్ ఆప్షన్లు :
రివర్స్, ఔట్ అండ్ బ్యాక్, క్లోజ్ లూప్ అనే మూడు ఆప్షన్లతో రూట్‌ను మీ అవసరానికి అనుగుణంగా మార్చుకోవచ్చు.
రూట్‌ను సేవ్ చేసుకోండి :
రూట్ పూర్తయిన తర్వాత సేవ్ రూట్పై ట్యాప్ చేసి, దానికి ఒక పేరు పెట్టి సేవ్ చేసుకోవచ్చు.
ఆఫ్‌లైన్‌లోనూ ఉపయోగం :
సేవ్ చేసిన కస్టమ్ రూట్ ఐఫోన్‌లో డౌన్‌లోడ్ అవుతుంది. దీంతో హైకింగ్ సమయంలో నెట్‌వర్క్ సిగ్నల్ లేకపోయినా రూట్‌ను యాక్సెస్ చేయవచ్చు.
సేవ్ చేసిన రూట్ ఎక్కడ? :
మ్యాప్స్‌లో ప్రొఫైల్ ఐకాన్ → ప్లేసెస్ → రూట్స్లోకి వెళ్తే మీరు సేవ్ చేసిన కస్టమ్ రూట్స్ కనిపిస్తాయి. ప్రారంభ ప్రదేశానికి చేరుకున్న తర్వాత గో ట్యాప్ చేస్తే ఐఫోన్ రూట్‌లో మార్గనిర్దేశం చేస్తుంది.