బెంగళూరు బాస్ మళ్లీ అతడే!

ఐపీఎల్ 2025, 2026 సీజన్లలో ఆర్సీబీని విజేతగా నిలిపిన రజత్ పాటిదార్.. IPL 2027లోనూ కెప్టెన్‌గా కొనసాగుతాడని అంచనా. విజయవంతమైన నాయకత్వాన్ని మార్చే అవకాశం తక్కువే!
గుజరాత్ కెప్టెన్‌గా గిల్!
గుజరాత్ టైటాన్స్‌కు శుభ్‌మన్ గిల్ మరోసారి నాయకత్వం వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యాటర్‌గా రాణిస్తూనే జట్టును ముందుకు నడిపిస్తున్న గిల్‌పై ఫ్రాంచైజీ నమ్మకం కొనసాగవచ్చు.
రాజస్థాన్ పగ్గాలు పరాగ్‌కేనా?
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రియాన్ పరాగ్ కొనసాగొచ్చు. యువ ఆటగాడైనా కీలక నిర్ణయాలతో ఆకట్టుకున్నాడు. యశస్వి జైస్వాల్ పేరు వినిపిస్తున్నా పరాగ్‌కే మరో అవకాశం దక్కొచ్చు.
హైదరాబాద్‌కు ఇషాన్ కెప్టెన్?
పాట్ కమిన్స్ అందుబాటుపై సందేహాలు ఉండటంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. గతంలో కమిన్స్ గైర్హాజరీలో జట్టును నడిపిన అనుభవం అతడికి ఉంది.
ముంబైకి మళ్లీ హిట్‌మ్యాన్?
హార్దిక్ పాండ్యా పంజాబ్‌కు మారతాడనే ప్రచారం నేపథ్యంలో రోహిత్ శర్మ మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టొచ్చని అంచనా. ఐదుసార్లు టైటిల్ అందించిన అనుభవం అతడి బలం.
కోల్‌కతా కొత్త బాస్ రింకూనేనా?
అజింక్య రహానె రిటైర్మెంట్ నేపథ్యంలో కేకేఆర్ కొత్త కెప్టెన్ కోసం చూస్తోందని కథనం పేర్కొంది. ప్రస్తుత ఆటగాళ్లలో రింకూ సింగ్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
లక్నో కెప్టెన్‌గా పూరన్?
రిషబ్ పంత్ ఢిల్లీకి మారినట్లు వస్తున్న వార్తలతో లక్నో కెప్టెన్సీపై చర్చ మొదలైంది. నికోలస్ పూరన్ ప్రధాన పోటీదారుడిగా కనిపిస్తున్నాడు. మిచెల్ మార్ష్, మార్క్రమ్ కూడా రేసులో ఉండొచ్చు.
ఢిల్లీ పగ్గాలు రాహుల్‌కేనా?
అక్షర్ పటేల్ భవిష్యత్తుపై ట్రేడ్ ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా మారొచ్చని అంచనా. ఐపీఎల్‌లో నాయకత్వ అనుభవం అతడికి కలిసొచ్చే అంశం.
పంజాబ్‌కు శ్రేయస్ నాయకత్వం!
పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ కొనసాగడం దాదాపు ఖాయమనే అంచనాలు ఉన్నాయి. 2025లో జట్టును ఫైనల్‌కు చేర్చిన అతడిపై ఫ్రాంచైజీ మరోసారి నమ్మకం ఉంచొచ్చు.
చెన్నై సారథిగా రుతురాజ్!
చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి రుతురాజ్ గైక్వాడ్‌కే కెప్టెన్సీ అప్పగించే అవకాశముంది. గత సీజన్లలో ఆశించిన ఫలితాలు రాకపోయినా అతడికి మరో అవకాశం ఇవ్వొచ్చని అంచనా.