డిసెంబర్ 16న గోవా వేదికగా జరగనున్న ఐపీఎల్ 2027 మినీ వేలం కోసం మొత్తం 1,220 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు.
కేవలం 66 స్థానాల కోసమే పోటీ!
939 మంది భారతీయులు, 281 మంది విదేశీ ఆటగాళ్లు వేలంలోకి వస్తుండగా.. 10 జట్లలో ఉన్న 66 ఖాళీ స్థానాల (25 విదేశీ) కోసమే అసలు పోటీ జరగనుంది.
రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌లో ఇద్దరే భారతీయులు!
అత్యధిక కనీస ధర అయిన రూ. 2 కోట్ల జాబితాలో మొత్తం 29 మంది నిలవగా, భారత్ నుండి కేవలం పేసర్లు అవేశ్ ఖాన్, దీపక్ చాహర్ మాత్రమే చోటు దక్కించుకున్నారు.
బెన్ స్టోక్స్ రీ-ఎంట్రీ!
2023 తర్వాత ఐపీఎల్‌కు దూరంగా ఉన్న ఇంగ్లాండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌తో తిరిగి వేలంలోకి అడుగుపెట్టాడు.
డేవిడ్ వార్నర్‌కు మరో ఛాన్స్ దక్కేనా?
గత సీజన్లలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, మళ్లీ రూ. 2 కోట్ల విభాగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
ఆస్ట్రేలియా నుంచి 5 మంది స్టార్లు!
డేవిడ్ వార్నర్‌తో పాటు జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, జై రిచర్డ్సన్, స్పెన్సర్ జాన్సన్, మహలీ బియర్డ్‌మన్ రూ. 2 కోట్ల జాబితాలో ఉన్నారు.
న్యూజిలాండ్ ఆటగాళ్ల హవా!
కివీస్ నుంచి అత్యధికంగా 8 మంది ఉన్నారు: ట్రెంట్ బౌల్ట్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, డెవాన్ కాన్వే, ఆడమ్ మిల్నే, బెన్ సియర్స్, విల్ ఓరూర్క్, బెవాన్ జాకబ్స్.
ఇంగ్లాండ్ & ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు
ఇంగ్లాండ్ నుండి జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, టామ్ కరన్, సోనీ బేకర్ ఉండగా; ఆఫ్ఘనిస్తాన్ నుండి రహ్మానుల్లా గుర్బాజ్, ముజీబ్ ఉర్ రెహమాన్, ఫజల్హక్ ఫారూఖీ నిలిచారు.
సౌతాఫ్రికా, లంక, విండీస్ పవర్!
అన్రిచ్ నోర్ట్జే, గెరాల్డ్ కోయెట్జీ (SA), మతీషా పతిరానా, వనిందు హసరంగా (SL), షిమ్రాన్ హెట్మెయర్, షాయ్ హోప్ (WI) కూడా రూ. 2 కోట్ల బ్రాకెట్లో ఉన్నారు.
తుది జాబితా ఎప్పుడంటే?
డిసెంబర్ 1 లోపు ఫ్రాంచైజీలు తమ షార్ట్‌లిస్ట్‌ను బీసీసీఐకి అందిస్తాయి. ఆ తర్వాత వేలానికి వారం ముందు తుది జాబితా విడుదలవుతుంది!