89 మందికి మొండిచేయి..

20వ సీజన్‌కు ముందు అన్ని జట్లు 89 మందిని వదిలేశాయి. కోట్లు పారబోసి కొన్న స్టార్లకే మొండిచేయి. టాప్-5 లిస్ట్ చూద్దాం!
మినీ వేలానికి బిల్డప్ షురూ!
మంగళవారం సాయంత్రం 10 ఫ్రాంచైజీలు రిటెన్షన్ జాబితా ప్రకటించాయి. స్టార్లు, సీనియర్లు చాలామంది వేలంలోకి వస్తున్నారు. పర్సు ఖాళీ చేసిన టాప్-5 ఎవరంటే?
మిచెల్ స్టార్క్ - రూ.11.75 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ ఆసీస్ పేసర్ స్టార్క్‌ను వదిలేసింది. బిజీ ఇంటర్నేషనల్ షెడ్యూల్ వల్ల 2027 సీజన్‌కు దూరమయ్యే అవకాశం ఉందని టాక్.
స్టార్క్ ప్రదర్శన ఎలా ఉంది?
2025లో 11.75 కోట్లకు ఢిల్లీకి వచ్చాడు. రెండు సీజన్లలో 17 మ్యాచ్‌ల్లో 25 వికెట్లు తీశాడు. అయినా ఫ్రాంచైజీ రిస్క్ చేయలేదు.
ట్రెంట్ బౌల్ట్ - రూ.12.50 కోట్లు
ముంబై ఇండియన్స్ లెఫ్టార్మ్ పేసర్ బౌల్ట్‌ను రిలీజ్ చేసింది. బుమ్రాతో జోడీ కోసం 12.50 కోట్లు పెట్టి తెచ్చుకున్నా ఫలితం లేదు.
బౌల్ట్ ఎందుకు విఫలమయ్యాడు?
గత సీజన్‌లో కేవలం 5 మ్యాచ్‌ల్లో 2 వికెట్లే. ఎకానమీ 11.62! అందుకే ముంబై హార్దిక్ పాండ్యాతో ట్రేడ్ చేసి అర్ష్‌దీప్ సింగ్‌ను తెచ్చుకుంది.
ట్రావిస్ హెడ్ - రూ.14 కోట్లు
అతిపెద్ద షాక్ ఇదే! సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్‌ను వదిలేసింది. అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్‌లో విధ్వంసం సృష్టించిన హెడ్ ఔట్.
హెడ్ నంబర్లు అదుర్స్!
2024లో 14 కోట్లకు SRHలోకి వచ్చాడు. 3 సీజన్లలో 43 మ్యాచ్‌ల్లో 1351 పరుగులు, స్ట్రైక్‌రేట్ 176.14! 1 సెంచరీ, 9 హాఫ్ సెంచరీలు.
ప్రశాంత్ వీర్ - రూ.14.20 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్ భారీ పందెం బోల్తా! జడేజా రీప్లేస్‌మెంట్‌గా 14.20 కోట్లు పెట్టి కొన్న వీర్ 5 ఇన్నింగ్స్‌ల్లో 90 పరుగులే, కేవలం 2 ఓవర్లే బౌలింగ్.
మతీష పతిరానా - రూ.18 కోట్లు!
ఈసారి అత్యంత ఖరీదైన రిలీజ్ పతిరానానే! 18 కోట్లు పెట్టి కొన్న KKRకు గాయాలతో నిరాశే. 8 బంతులే వేసి సీజన్ మొత్తం దూరమయ్యాడు. 23 ఏళ్ల వయసులో మళ్లీ కోట్లు పలకడం ఖాయమా? వేచి చూడాలి!