ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వ్యవస్థ ఎంతటి బలమైనదో మనందరికీ తెలుసు. అయితే సముద్రం అడుగున ఉండే కేబుల్స్ పట్ల ఎప్పుడూ ఒక రకమైన ఆందోళన ఉంటుంది. ముఖ్యంగా ఇరాన్ దేశం సముద్ర మార్గంలోని ఇంటర్నెట్ కేబుల్స్ తెంపేస్తే మన దేశంలో యూపీఐ సేవలు అలాగే వాట్సాప్ వంటి ముఖ్యమైన యాప్లు పూర్తిగా నిలిచిపోతాయనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి.