అరటిపండులో పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, బి6 అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని, కండరాల పనితీరును మెరుగుపరుస్తాయి.
వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?:
అరటిపండు తిన్న వెంటనే ఎక్కువ నీరు తాగడం వల్ల సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారిలో కడుపు ఉబ్బరం, అసౌకర్యం లేదా గ్యాస్ వచ్చే అవకాశం ఉంది.
చల్లటి నీటితో ప్రమాదం:
పండు తిన్న వెంటనే గడ్డకట్టినట్లు ఉండే చల్లటి నీటిని తాగితే కడుపులో అసౌకర్యం, అజీర్ణం వంటి సమస్యలు ఎదురుకావచ్చు.
శాస్త్రీయ ఆధారాలు ఉన్యా?:
అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల అందరికీ కడుపు సమస్యలు వస్తాయని చెప్పడానికి ఖచ్చితమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది వ్యక్తిగత శరీర తత్వాన్ని బట్టి మారుతుంది.
నీళ్లు ఎప్పుడు తాగాలి?:
అరటిపండు తిన్న వెంటనే కాకుండా సుమారు 15 నుంచి 30 నిమిషాల వ్యవధి ఇచ్చి నీళ్లు తాగడం శ్రేయస్కరం.
గోరువెచ్చని లేదా సాధారణ నీరు:
ఫ్రిజ్ నీటికి బదులుగా సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని లేదా గోరువెచ్చని నీటిని కొద్ది కొద్దిగా తీసుకోవడం మంచిది.
భోజనం తర్వాత తేలికపాటి నడక:
తిన్న తర్వాత లేదా పండ్లు తిన్నాక 10 నుంచి 15 నిమిషాల పాటు నెమ్మదిగా నడవడం వల్ల జీర్ణక్రియ వేగవంతమవుతుంది.
వెంటనే పడుకోవద్దు:
తిన్న వెంటనే పడుకోవడం లేదా ఎక్కువగా వంగడం చేయకూడదు. కనీసం 30 నిమిషాల పాటు నిటారుగా కూర్చోవడం వల్ల అసిడిటీ, గుండెల్లో మంట తగ్గుతాయి.
నమిలి తినడం ముఖ్యం:
ఆహారాన్ని లేదా పండ్లను తొందరపడకుండా నెమ్మదిగా నమిలి తినడం వల్ల జీర్ణరసాలు సరిగ్గా ఊరి ఆహారం సులభంగా అరుగుతుంది.
సరైన అలవాట్లతో ఆరోగ్యం:
రోజూ సమయానికి భోజనం చేయడం, తగినంత నీరు తాగడం, సరైన పద్ధతిలో పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది.