జీమెయిల్ స్టోరేజ్ ఫుల్ అయిందా? డేటా డిలీట్ చేయకుండానే ఇలా చేస్తే.!
పెద్ద అటాచ్‌మెంట్లను వెతికి తొలగించడం
జీమెయిల్ సెర్చ్ బార్‌లో has:attachment larger:10M అని టైప్ చేసి వెతికితే, 10MB కంటే ఎక్కువ సైజు ఉన్న మెయిల్స్ వస్తాయి. వాటిలో అవసరం లేని భారీ ఫైల్స్ ఉన్న మెయిల్స్‌ను డిలీట్ చేయవచ్చు.
ట్రాష్, స్పామ్ ఫోల్డర్లను క్లియర్ చేయడం
మనం డిలీట్ చేసిన మెయిల్స్ అన్నీ ట్రాష్, స్పామ్ ఫోల్డర్లలోనే ఉండి స్పేస్‌ను ఆక్రమిస్తుంటాయి. వాటిని పూర్తిగా ఖాళీ చేయడం ద్వారా వెంటనే స్పేస్ పొందవచ్చు.
ప్రమోషనల్, మార్కెటింగ్ మెయిల్స్ తొలగింపు
అవసరం లేని కంపెనీల ప్రమోషనల్ మెయిల్స్ పేరుకుపోయి స్పేస్ నింపేస్తుంటాయి. category:promotions అని సెర్చ్ చేసి వాటిని ఒకేసారి సెలెక్ట్ చేసి డిలీట్ చేయవచ్చు.
అన్-సబ్స్క్రైబ్ చేయడం ద్వారా రక్షణ
ఎప్పటికప్పుడు మనకు నూతనంగా వచ్చే అవాంఛిత న్యూస్‌లెటర్స్ లేదా ఈమెయిల్ అలర్ట్స్‌కు కింద ఉండే 'Unsubscribe' ఆప్షన్ ద్వారా దూరంగా ఉండవచ్చు.
పాత ఈమెయిల్స్‌ను ఫిల్టర్ చేసి తొలగించడం
చాలా కాలం కిందటి పాత మెయిల్స్ అవసరం లేకపోతే, డేట్ వైజ్ లేదా ఇయర్ వైజ్ ఫిల్టర్ చేసి అనవసరమైన వాటిని తొలగించడం మంచిది.
గూగుల్ వన్ స్టోరేజ్ మేనేజర్ ఉపయోగించడం
[one.google.com/storage](https://one.google.com/storage) వెబ్‌సైట్‌ను సందర్శించి, గూగుల్ సూచించే అవాంఛిత ఫైల్స్, లార్జ్ అటాచ్‌మెంట్లను సులభంగా క్లియర్ చేసుకోవచ్చు.
గూగుల్ ఫోటోలు, డ్రైవ్ క్లీనింగ్
కేవలం జీమెయిలే కాకుండా గూగుల్ ఫోటోలలో ఉన్న అనవసరమైన స్క్రీన్‌షాట్లు, బ్లర్ అయిన ఫోటోలను తొలగించడం ద్వారా ఉమ్మడి స్టోరేజ్ ఖాళీ అవుతుంది.
వాట్సాప్ బ్యాకప్ సెట్టింగ్‌లను మార్చడం
ఫోన్ నుండి గూగుల్ డ్రైవ్‌కు సేవ్ అయ్యే వాట్సాప్ వీడియోల బ్యాకప్‌ను ఆపివేయడం ద్వారా కూడా కొంత మేర స్పేస్‌ను ఆదా చేసుకోవచ్చు.
గూగుల్ టేక్అవుట్ ద్వారా బ్యాకప్ తీసుకోవడం
ముఖ్యమైన మెయిల్స్‌ను డిలీట్ చేసే ముందు భద్రత కోసం 'Google Takeout' ద్వారా వాటిని మీ కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్ చేసుకొని భద్రపరుచుకోవచ్చు.