ఇషాన్ కిషన్‌కు మరో మ్యాచ్ దూరం

న్యూజిలాండ్‌తో మూడో టీ20కి ఇషాన్ కిషన్ దూరమయ్యాడు. దీంతో వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం దక్కే అవకాశంపై చర్చ మొదలైంది.
ఇషాన్‌కు గాయం
తొలి టీ20లో ఇషాన్ కిషన్ కుడి తొడ కండరానికి స్వల్ప గాయం అయింది. ఇంకా పూర్తి మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించలేదు.
బీసీసీఐ కీలక ప్రకటన
ఇషాన్ పురోగతిని బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. మూడో టీ20కి అతడు అందుబాటులో ఉండడని స్పష్టం చేసింది.
కుశాగ్ర కొనసాగింపు
ఇషాన్ స్థానంలో జట్టులోకి వచ్చిన కుమార్ కుశాగ్ర మూడో టీ20కి కూడా జట్టుతోనే కొనసాగుతాడని బీసీసీఐ తెలిపింది.
వైభవ్‌కు తొలి అవకాశం
రెండో టీ20లో ఇషాన్ స్థానంలో వైభవ్ సూర్యవంశీ ఆడాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసి 8 బంతుల్లో 4 పరుగులకే వెనుదిరిగాడు.
ఓపెనర్‌గా వైభవ్
సీనియర్ క్రికెట్‌లో ఇప్పటివరకు ఓపెనర్‌గా మాత్రమే ఆడిన వైభవ్‌ను మూడో స్థానంలో పంపడం చర్చకు దారితీసింది.
అశ్విన్ అభిప్రాయం
వైభవ్ ఆరో స్థానంలో కాకుండా ఓపెనర్‌గా బరిలోకి దిగితేనే సహజ ఆట ఆడగలడని రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
మురళీ కార్తీక్ సూచన
వైభవ్‌ను జట్టులోకి తీసుకుంటే ఓపెనర్‌గానే ఆడించాలని మురళీ కార్తీక్ సూచించాడు. మధ్యక్రమంలో అతడు అంతగా ఆడలేదని చెప్పాడు.
సంజూ కీలక పాత్ర?
ఇషాన్ లేని లోటును భర్తీ చేసేందుకు సంజూ శాంసన్‌ను మూడో స్థానంలో ఆడించి, వైభవ్‌ను ఓపెనర్‌గా పంపాలని మాజీ ఆటగాళ్లు సూచించారు.
వైభవ్‌కు మరో ఛాన్స్?
మూడో టీ20కి ఇషాన్ దూరం కావడంతో తుది జట్టుపై ఆసక్తి పెరిగింది. వైభవ్‌కు ఓపెనర్‌గా మరో అవకాశం వస్తుందా అనేది చూడాలి.