ఇషాన్ vs సూర్యకుమార్.. ఎవరిది బెస్ట్?

భారత టీ20ఐ క్రికెట్‌లో కొత్త రికార్డు నమోదైంది. 2026లో ఇషాన్ కిషన్ 1,220 పరుగులు చేసి.. ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక టీ20ఐ పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు.
సూర్య రికార్డును దాటిన ఇషాన్!
న్యూజిలాండ్‌తో ఐదో టీ20లో ఇషాన్ కిషన్‌కు రికార్డు బద్దలు కొట్టేందుకు కేవలం 6 పరుగులు అవసరం. కానీ అతడు 32 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. దీంతో 2026లో అతడి టీ20ఐ పరుగుల సంఖ్య 1,220కి చేరింది.
ఇషాన్ కిషన్ రికార్డులు
1,220 పరుగులు, సగటు: 35.88, స్ట్రైక్‌రేట్: 171.58, సెంచరీలు: 1, హాఫ్ సెంచరీలు: 8
సూర్యకుమార్
1,164 పరుగులు, సగటు: 46.66, స్ట్రైక్‌రేట్: 187.43, సెంచరీలు: 2, హాఫ్ సెంచరీలు: 9
సగటులో ఎవరు ముందున్నారు?
ఇషాన్ రన్స్ విషయంలో రికార్డు సృష్టించినా.. బ్యాటింగ్ సగటులో సూర్యకుమార్‌దే పైచేయి. సూర్యకుమార్ – 46.66, ఇషాన్ కిషన్ – 35.88. అంటే సూర్య 2022లో మరింత స్థిరంగా పరుగులు చేశాడు.
స్ట్రైక్‌రేట్‌లోనూ సూర్యదే హవా!
టీ20లో వేగంగా పరుగులు చేయడం కీలకం. ఈ విషయంలోనూ సూర్యకుమార్ ముందున్నాడు. సూర్యకుమార్ – 187.43, ఇషాన్ కిషన్ – 171.58. అయితే 2026లో ఇషాన్‌కు ఇంకా మూడు టీ20ఐలు మిగిలి ఉన్నాయి.
సెంచరీలు, హాఫ్ సెంచరీలు
సూర్యకుమార్ – 2 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు. ఇషాన్ కిషన్ – 1 సెంచరీ, 8 హాఫ్ సెంచరీలు. రన్స్‌లో ఇషాన్ ముందున్నా.. పెద్ద ఇన్నింగ్స్‌ల విషయంలో సూర్య కొంత ముందంజలో ఉన్నాడు.
అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఎవరిది?
సూర్యకుమార్ 2022లో ఇంగ్లండ్‌పై నాటింగ్‌హామ్‌లో 55 బంతుల్లో 117 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 2026లో న్యూజిలాండ్‌పై తిరువనంతపురంలో 43 బంతుల్లో 103 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్‌లో సూర్య ముందున్నాడు.
ఫోర్లు, సిక్సర్లలో ఎవరు కింగ్?
2026లో ఇషాన్ కిషన్ ఇప్పటివరకు 127 ఫోర్లు, 60 సిక్సర్లు బాదగా, 2022లో సూర్యకుమార్ 106 ఫోర్లు, 68 సిక్సర్లు బాదాడు. అంటే బౌండరీల పరంగా ఇషాన్ ఫోర్లలో ముందుంటే.. సిక్సర్లలో సూర్య ఆధిపత్యం చూపించాడు.
మరి ఎవరిది బెస్ట్ ఇయర్?
ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక టీ20ఐ పరుగుల రికార్డు ఇప్పుడు ఇషాన్ కిషన్‌ది. ఇషాన్ – 1,220 పరుగులు, సూర్య – 1,164 పరుగులు. అయితే సగటు, స్ట్రైక్‌రేట్, సెంచరీలు, హాఫ్ సెంచరీలు, అత్యధిక స్కోర్‌లో సూర్యకుమార్ ముందున్నాడు.