కిడ్నీలు మన శరీరంలో నిర్విరామంగా పనిచేస్తూ, ఒక రోజులో దాదాపు 180 నుంచి 200 లీటర్ల రక్తాన్ని వడపోసి వ్యర్థాలను, అధికంగా ఉన్న నీటిని మూత్రం రూపంలో బయటకు పంపుతాయి.
నీటి వినియోగం-వ్యక్తిగత అవసరం:
రోజుకు సాధారణంగా 4 నుంచి 7 లీటర్ల నీరు తాగడం కిడ్నీ రాళ్లను నిరోధిస్తుంది. అయితే, గుండె లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారు మాత్రం తమ వైద్యుల సలహా మేరకే నీటి పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి.
బీపీ, షుగర్ నియంత్రణ:
కంట్రోల్ లేని రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్) వ్యాధులు కిడ్నీలను క్రమంగా దెబ్బతీస్తాయి. అందుకే క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ వీటిని అదుపులో ఉంచుకోవాలి.
ఉప్పు, పంచదారకు దూరం:
ఆహారంలో ఉప్పు, పంచదార వినియోగాన్ని వీలైనంత తగ్గించాలి. అధిక ఉప్పు రక్తపోటును పెంచి కిడ్నీలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.
కిడ్నీకి మేలు చేసే ఆహారాలు:
ఆకుకూరలు, క్యాబేజీ, ఉల్లిపాయలు, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, స్వచ్ఛమైన తేనె, సీజన్ లో దొరికే పుచ్చకాయలు కిడ్నీల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఆల్కహాల్, స్మోకింగ్కు నో చెప్పండి:
పొగతాగడం, అధికంగా మద్యం సేవించడం అనేవి కిడ్నీల పనితీరును నేరుగా పాడుచేసే అత్యంత హానికరమైన అలవాట్లు. వీటికి తక్షణమే దూరంగా ఉండాలి.
మందుల దుష్ప్రభావాలు :
వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా సొంతంగా పెయిన్ కిల్లర్స్, ఇతర యాంటీబయాటిక్స్ వాడటం వల్ల కిడ్నీలు త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంది.
క్రమం తప్పకుండా శారీరక శ్రమ:
ప్రతిరోజూ క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం లేదా గార్డెనింగ్ లాంటి శారీరక శ్రమలు చేయడం ద్వారా శరీరం యాక్టివ్గా ఉండి కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
బరువు నియంత్రణ ముఖ్యం:
అధిక బరువు లేదా స్థూలకాయం కిడ్నీ వ్యాధులకు దారితీస్తుంది. కాబట్టి సమతుల్య ఆహారం, వ్యాయామాల ద్వారా శరీర బరువును ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవాలి.
8 గంటల నిద్ర తప్పనిసరి:
సరైన నిద్ర లేకపోవడం వల్ల శరీర జీవక్రియలు దెబ్బతింటాయి. కిడ్నీల పనితీరు సజావుగా సాగాలంటే ప్రతిరోజూ కనీసం 8 గంటల ప్రశాంతమైన నిద్ర అవసరం.