Kiwi Fruit: చూడటానికి చాలా చిన్నగా కనిపించే కివీ పండులో లెక్కలేనన్ని పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు దాగి ఉన్నాయి. ప్రతిరోజూ లేదా వారానికి కనీసం ఒక్క కివీ పండు తిన్నా కూడా శరీరానికి అవసరమైన విటమిన్ సి, విటమిన్ కే, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. డైటీషియన్లు, ఆరోగ్య నిపుణుల ప్రకారం ఈ పండును మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక రుగ్మతల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.