చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగను జరుపుకొంటారు.
ఉగాది పచ్చడి అంటేనే తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు కలిసిన షడ్రుచుల సమ్మేళనం.
ఉప్పు.. జీవితంలో ఆనందం, రుచికి సంకేతంగా పరిగణిస్తారు. ఇది రుచిని, భయాన్ని సూచిస్తుంది.
పులుపు.. ఎలాంటి పరిస్థితులకైనా ఓర్పుగా ఉండాలని సూచిస్తుంది.
వేప పువ్వు.. బాధను దిగమింగాలని లేదా భరించాలని సూచిస్తుంది.
బెల్లం.. ఈ తియ్యని పదార్థం సంతోషానికి ప్రతీకగా భావిస్తారు.
కారం.. సహనం కోల్పోవడాన్ని సూచిస్తుంది, ఆవేశానికి గురికావొచ్చు.
వగరు.. పచ్చి మామిడి ముక్కల్లో తగిలే ఈ రుచి కొత్త సవాళ్లను ఎదుర్కోవడం గురించి తెలియజేస్తుంది.
ఈ సంవత్సరం నాలుగు రాశులవారికి అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి.
తుల రాశి.. ఏదైన అడ్డంకులు, సమస్యలతో బాధపడేవారికి మంచి పరిణామాలు ఉంటాయి.
మిథునం.. ఊహించని విధంగా కొన్ని పనులు జరిగి జీవితం కొత్తగా మారుతుంది.
ధనుస్సు.. ధనుస్సు రాశి వారికి ఉగాది నుంచి అదృష్టం కలిసివస్తుంది.
సింహం.. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు తిరిగి చేతికి వస్తుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి.