వేరియంట్లు - ధరలు

ఈ స్కూటర్ రెండు మోడల్స్ (NDuro 2.0 - రూ.87,550, NDuro 3.0 - రూ.1.02 లక్షలు) లో లభిస్తుంది.
బ్యాటరీ సామర్థ్యం
ఎండ్యూరో 2.0 లో 2.3kWh బ్యాటరీ, ఎండ్యూరో 3.0 మోడల్ లో 3kWh బ్యాటరీని అందించారు.
ఉత్తమ మైలేజ్/రేంజ్
ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే వేరియంట్లను బట్టి 90 కిమీ నుండి 120 కిమీల వరకు ప్రయాణించవచ్చు.
ఛార్జింగ్ సమయం
ప్రత్యేక స్టేషన్ అవసరం లేకుండా, ఇంట్లోనే 4.5 గంటల్లో దీనిని ఫుల్ ఛార్జ్ చేయవచ్చు.
మోటార్ పవర్
రెండు వేరియంట్లలోనూ స్మూత్ రైడింగ్ కోసం శక్తివంతమైన 1.2kW ఎలక్ట్రిక్ మోటార్‌ను వాడారు.
టాప్ స్పీడ్
ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంది.
వాటర్ రెసిస్టెన్స్
వర్షంలోనూ బైక్ పాడవకుండా ఉండేందుకు మోటార్‌కు ఐపీ67 (IP67) ప్రొటెక్షన్ రేటింగ్ ఇచ్చారు.
రైడింగ్ మోడ్స్
రైడర్ల సౌకర్యం కోసం ఇందులో ఈకో, నార్మల్ మరియు స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి.
స్మార్ట్ డిస్‌ప్లే
నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ కోసం ఇందులో 5-అంగుళాల డిజిటల్ డిస్‌ప్లేను అమర్చారు.
రైడింగ్ కంఫర్ట్
ప్రయాణం సులభంగా ఉండేందుకు టెలిస్కోపిక్ సస్పెన్షన్, 12-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు ఇచ్చారు.