Health Tips: మీ లివర్ డ్యామేజైతే.? శరీరంలో కనిపించే లక్షణాలు ఇవే.!
తీవ్రమైన అలసట వేధించడం:
ఎంత విశ్రాంతి తీసుకున్నప్పటికీ శరీరంలో శక్తి లేనట్లుగా తీవ్రమైన అలసట ఎప్పుడూ వేధిస్తూ ఉంటుంది.
ఆకలి పూర్తిగా తగ్గిపోవడం:
అకస్మాత్తుగా ఆకలి వేయకపోవడం, క్రమంగా బరువు పడిపోవడం వంటి మార్పులు కనిపిస్తాయి.
పొత్తికడుపు పైభాగంలో నొప్పి:
పొత్తికడుపునకు పైభాగంలో ఎడమ లేదా కుడి వైపున పదే పదే నొప్పి రావడం జరుగుతుంది. వికారం, అజీర్తి సమస్యలు, ఏది తిన్నా సరిగ్గా అరగకపోవడం, తరచూ వికారం, అజీర్తి వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.
చర్మంపై ఎర్రటి మచ్చలు:
శరీరంపై లేదా చర్మంపై ఎర్రటి రంగులో కొత్త మచ్చలు ఏర్పడటం గమనించవచ్చు.
అరచేతులు ఎర్రగా మారడం:
సాధారణ స్థితికి భిన్నంగా అరచేతులు పూర్తిగా ఎర్రగా మారే లక్షణం కనిపిస్తుంది.
జీర్ణవ్యవస్థ పనితీరు మందగించడం:
శరీరంలో వ్యర్థాలను తొలగించే ప్రక్రియ మందగించడం వల్ల కడుపులో అసౌకర్యం కలుగుతుంది.
చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం:
లివర్ సమస్యలు తీవ్రమైనప్పుడు పచ్చకామెర్లు లక్షణాలు బయటపడతాయి.
వెంటనే ఆసుపత్రికి వెళ్లడం:
ఇలాంటి ముందస్తు లక్షణాలు ఏవి కనిపించినా అసలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
క్రమమైన ఆరోగ్య పరీక్షలు:
సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా పెద్ద ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.