ఆటల కోసం పెయిడ్ లీవ్

టెక్ సంస్థ లాజిటెక్ తన ఉద్యోగుల కోసం వినూత్న నిర్ణయం తీసుకుంది. వీడియో గేమ్స్ ఆడుకునేందుకు ఏడాదిలో ఒక రోజు పెయిడ్ లీవ్ ఇచ్చింది.
7 వేల మందికి అవకాశం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 7 వేల మంది ఉద్యోగులకు ఈ సెలవు వర్తిస్తుంది. ఫుల్‌టైమ్ ఉద్యోగులతో పాటు ఇంటర్న్‌లకూ ఈ అవకాశం ఉంది.
లాగి గేమ్ డే
GTA VI విడుదల సమయంలో ఉద్యోగులు సెలవులు పెట్టకుండా ఉండేందుకు 'లాగి గేమ్ డే' పేరుతో ఈ ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టింది.
రిలీజ్ రోజే అక్కర్లేదు
ఈ సెలవును కేవలం GTA 6 విడుదల రోజునే తీసుకోవాల్సిన అవసరం లేదు. వచ్చే ఏడాది నవంబర్‌లోగా నచ్చిన ఏ రోజైనా వాడుకోవచ్చు.
సీఈఓ ఏమన్నారంటే
గేమ్స్ ఆడటం సమయం వృథా చేయడం కాదని లాజిటెక్ సీఈఓ హన్నెకే ఫాబర్ అన్నారు. గేమింగ్‌తో ఉద్యోగుల్లో ఉల్లాసం పెరిగి, పనితీరు మెరుగవుతుందన్నారు.
కొత్త ఉత్సాహం
సరైన విశ్రాంతి, ఆటలతో కూడిన విరామం ఉద్యోగులకు కొత్త ఉత్సాహాన్నిస్తుందని చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఎలైన్ లైర్డ్ తెలిపారు. సరికొత్త ఆలోచనలతో విధులకు వస్తారని చెప్పారు.
నవంబర్ 19న గేమింగ్ ఈవెంట్
నవంబర్ 19న లాజిటెక్ కార్యాలయంలో జరిగే గేమింగ్ కార్యక్రమంలో సీఈఓ హన్నెకే ఫాబర్ స్వయంగా పాల్గొననున్నారు.
15 లక్షల మంది సెలవు
GTA 6 విడుదల సమయంలో అమెరికాలో సుమారు 15 లక్షల మంది ఉద్యోగులు విధులకు దూరంగా ఉండవచ్చని, బిలియన్ డాలర్ల నష్టం రావచ్చని అంచనా వేశారు.
సిక్ లీవ్ సాకుతో
చాలామంది గేమర్లు గేమ్స్ ఆడేందుకు సాధారణ సెలవులు అడగకుండా సిక్ లీవ్ తీసుకుంటున్నట్లు కొన్ని సర్వేలు వెల్లడించాయి.
కార్పొరేట్ రంగంలో చర్చ
లాజిటెక్ బాటలోనే అమెరికాలోని కొన్ని సైనిక విభాగాలు కూడా సైనికులకు ప్రత్యేక సెలవులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం కార్పొరేట్ రంగంలో కొత్త చర్చకు దారితీసింది.