సూపర్ ఫుడ్ కరివేపాకు:

సీజన్‌తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లోనూ అందుబాటులో ఉండే కరివేపాకులో అనేక పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
బరువు తగ్గించడంలో సహాయం:
కరివేపాకును రోజూ తీసుకోవడం ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా సులభంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మహానింబైన్ గుణాలు:
కరివేపాకు ఆకుల్లో లభించే మహానింబైన్ అనే ఆల్కనాయిడ్‌‌లో యాంటీ ఒబెసిటీ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
పరగడుపున తీసుకోవడం ఉత్తమం:
ఉదయం పూట పరగడుపున కరివేపాకును తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు మైనంలా కరిగిపోతుంది.
మెటబాలిజం పెరుగుదల:
ఈ ఆకులను నమలడం లేదా రసం రూపంలో సేవించడం వల్ల శరీరంలో మెటబాలిజం (జీవక్రియ) వేగవంతం అవుతుంది.
మంచి కొలెస్ట్రాల్ పెంపు:
కరివేపాకులోని పోషకాలు శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి, గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తాయి.
జీర్ణశక్తి మెరుగుదల:
ఆహారం సరిగ్గా అరగక ఇబ్బంది పడేవారికి కరివేపాకు దివ్యౌషధంగా పనిచేసి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
కంటి చూపు మెరుగుపడుతుంది:
ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దృష్టి లోపాలు రాకుండా రక్షణ కల్పిస్తుంది.
రక్తహీనత నివారణ:
కరివేపాకులో ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఉండటం వల్ల శరీరంలో రక్తహీనత (అనీమియా) సమస్య క్రమంగా తగ్గిపోతుంది.
చర్మం, జుట్టు సంరక్షణ:
కరివేపాకు తినడం వల్ల జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది. చర్మానికి కూడా సహజమైన నిగారింపు వస్తుంది.