ఏమిటీ MRM పోర్టల్?:

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని I4C సైబర్ క్రైమ్ బాధితుల కోసం National Cybercrime Reporting Portal (NCRP) కింద MRM సబ్-పోర్టల్‌ను తీసుకొచ్చింది.
ముఖ్యమైన నిబంధన:
సైబర్ దాడి జరిగిన వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా NCRP పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసి, నేరస్థుల ఖాతాలో డబ్బు ఫ్రీజ్ అయిన బాధితులకు మాత్రమే ఈ క్లెయిమ్ వర్తిస్తుంది.
రూ.50,000 లోపు ఉంటే (కేటగిరీ 1):
ఫ్రీజ్ అయిన మొత్తం రూ.50,000 కంటే తక్కువగా ఉంటే, ఎఫ్‌ఐఆర్ లేదా కోర్టు ఆర్డర్ కాపీ లేకుండానే పోలీసు ఫిర్యాదు ఆధారంగా డబ్బు రీఫండ్ అవుతుంది.
వివిధ ఖాతాల్లో ఉంటే (కేటగిరీ 2):
పోగొట్టుకున్న మొత్తం ఎంతైనా, విడివిడిగా ఒక్కో బ్యాంకు ఖాతాలో ఫ్రీజ్ అయిన సొమ్ము రూ.50,000 దాటకపోతే కోర్టు ఆర్డర్ అవసరం లేదు.
రూ.50,000 దాటితే (కేటగిరీ 3):
ఏదేని ఒక్క బ్యాంకు ఖాతాలో ఫ్రీజ్ అయిన సొమ్ము రూ.50,000 కంటే ఎక్కువగా ఉంటే, రీఫండ్ క్లెయిమ్ కోసం ఎఫ్‌ఐఆర్ మరియు కోర్టు ఆర్డర్ తప్పనిసరి.
కావలసిన పత్రాలు:
రీఫండ్ అభ్యర్థన కోసం మీ 14 అంకెల Complaint ID, పాన్ కార్డ్ డిజిటల్ కాపీ, బ్యాంక్ ఖాతా వివరాలు, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ సిద్ధంగా ఉంచుకోవాలి.
లాగిన్ అయ్యే విధానం:
MRM పోర్టల్‌కు వెళ్ళి Citizen Login ఎంచుకుని, NCRP లో నమోదు చేసిన మొబైల్ నంబర్, OTP సహాయంతో లాగిన్ అవ్వాలి.
క్లెయిమ్ సబ్మిషన్:
'Raise Refund Request' పై క్లిక్ చేసి 14 అంకెల Complaint ID ని ఎంటర్ చేయాలి. తర్వాత ఫ్రీజ్ అయిన అమౌంట్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
వివరాల నమోదు: పాన్ కార్డ్,
బ్యాంక్ అకౌంట్, IFSC కోడ్ ఎంటర్ చేసి (అవసరమైతే కోర్టు ఆర్డర్ అప్‌లోడ్ చేసి) డిక్లరేషన్ బాక్స్ టిక్ చేసి సబ్మిట్ చేయాలి.
ట్రాకింగ్ ఐడీ:
అప్లికేషన్ సబ్మిట్ చేయగానే MR2026తో ప్రారంభమయ్యే Unique Request ID లభిస్తుంది. దీని ద్వారా రీఫండ్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు.