జీర్ణశక్తి పెరుగుతుంది:

రాత్రి పూట యాలకులు తినడం వల్ల జీర్ణ ఎంజైములు బాగా విడుదలై, తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయి.
గ్యాస్, అసిడిటీ దూరం:
డిన్నర్ కాస్త హెవీగా చేసినప్పుడు యాలకులు తింటే పొట్ట ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ సమస్యలు క్షణాల్లో మాయమవుతాయి.
నోటి దుర్వాసనకు చెక్:
యాలకులలో ఉండే సినియోల్ అనే ఎసెన్షియల్ ఆయిల్ నోటిలోని బ్యాక్టీరియాను పూర్తిగా తొలగించి, ఉదయం నోటి దుర్వాసన రాకుండా అడ్డుకుంటుంది.
నేచురల్ మౌత్ ఫ్రెషనర్:
ఇది ఓరల్ హైజీన్‌ను మెరుగుపరుస్తుంది. నిద్రపోయే ముందు తినడం వల్ల నోటిలో తేమ తగ్గకుండా ఉంటుంది.
హాయిగా నిద్ర పడుతుంది:
నిద్రలేమితో బాధపడేవారికి యాలకులు బెస్ట్ మెడిసిన్. ఇవి మైండ్‌ను రిలాక్స్ చేసి, యాంగ్జిటీని తగ్గిస్తాయి.
మెలటానిన్ ఉత్పత్తి:
యాలకుల్లో ఉండే మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు నరాల వ్యవస్థను శాంతపరిచి, నిద్రకు అవసరమైన మెలటానిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి.
బాడీ డిటాక్స్ అవుతుంది:
ఇందులో ఉండే డైయూరెటిక్ గుణాలు నిద్రపోతున్నప్పుడు శరీరంలో పేరుకుపోయిన హానికర వ్యర్థాలను, టాక్సిన్స్‌ను యూరిన్ ద్వారా బయటకు పంపుతాయి.
లివర్, చర్మ ఆరోగ్యం:
యాలకులు లివర్ పనితీరును మెరుగుపరచడమే కాకుండా, రక్తాన్ని శుద్ధి చేసి చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తాయి.
త్రిదోష నివారిణి:
ఆయుర్వేదం ప్రకారం యాలకులు శరీరంలోని కఫ, వాత, పిత్త దోషాలను బ్యాలెన్స్ చేసి ఇమ్యూనిటీని పెంచుతాయి.
శ్వాసకోశ సమస్యల ఉపశమనం:
ఇవి ఛాతిలో పేరుకుపోయిన శ్లేష్మాన్ని కరిగించి.. దగ్గు, జలుబు, ఆస్తమా, సైనస్ ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.