తక్కువ క్యాలరీలు:

మఖానాలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు నిరభ్యరంగా దీన్ని తీసుకోవచ్చు.
ఎముకల బలం:
ఇందులో కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు అలాగే కీళ్లు బలంగా మారుతాయి. ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారికి ఇది చాలా మంచిది.
గుండె ఆరోగ్యం:
మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉండటం ద్వారా రక్తపోటు అదుపులో ఉండి గుండె పనితీరు మెరుగవుతుంది.
జీర్ణక్రియ మెరుగుదల:
పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసి మలబద్ధకం దూరం అవుతుంది.
యాంటీ ఏజింగ్ గుణాలు:
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ముడతలను తగ్గించి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
కడుపు నిండిన భావన:
ఫైబర్ అధికంగా ఉండటం వల్ల త్వరగా ఆకలి వేయదు, ఇది అనవసరంగా జంక్ ఫుడ్ తినడాన్ని నియంత్రిస్తుంది.
మధుమేహం నియంత్రణ:
గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
శరీరానికి శక్తి:
రోజూ గుప్పెడు మఖానాను నెయ్యిలో వేయించుకుని తింటే శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.
చెడు కొలెస్ట్రాల్ తగ్గింపు:
రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బుల ముప్పును సమర్థవంతంగా నివారిస్తుంది.
సులభమైన తయారీ:
కొద్దిగా నెయ్యి, చిటికెడు ఉప్పు, మిరియాల పొడి వేసుకుని దీన్ని చాలా రుచికరంగా తయారు చేసుకుని తినవచ్చు.