నిద్రలో అరుస్తున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
పారాసోమ్నియా వ్యాధి
నిద్రలో అరవడం లేదా కేకలు వేయడం లాంటిది పిచ్చి పట్టిందేమో అనుకునేరు. ఈ సమస్యను వైద్య పరిభాషలో 'పారాసోమ్నియా' అని పిలుస్తారు.
సమస్య తలెత్తేది అప్పుడే
మెదడు ఒక నిద్ర దశ నుంచి మరో దశకు సరిగ్గా మారనప్పుడు ఇలాంటి సమస్య తలెత్తుతుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
స్ట్రెస్ ఎక్కువ ఉండటం
రోజువారీ జీవితంలో విపరీతమైన ఒత్తిడి ఉండటం వల్ల కూడా నిద్రలో అరుస్తుంటారు.
నిద్రలేమి మరో ముఖ్య కారణం
మన రోజూ వారి పనులు రిత్యా మనం ఎప్పుడు నిద్రపోతున్నామో తెలియదు. అందుకే తగినంత నిద్ర లేకపోవడం (నిద్రలేమి) ఈ సమస్యకు మరో ముఖ్యమైన కారణంగా చెప్పవచ్చు.
మద్యం సేవించడం మానుకోవాలి
రాత్రి సమయంలో ఎక్కువగా మద్యం సేవించడం వల్ల కూడా నిద్రలో ఇబ్బందులు కలుగుతాయి.
రకరకాల మందులు వాడటం తగ్గించాలి
కొన్ని రకాల మందులు వాడటం వల్ల వాటి సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా ఇలా జరగవచ్చు.
పునరావృతం అయితే.. కండిషన్ సీరియస్
ఇది సాధారణంగా జరిగే విషయమే అయినప్పటికీ, తరచూ పునరావృతమైతే మాత్రం తీవ్రంగా పరిగణించాలి.
ఆ లక్షణాలు కనిపిస్తే
నిద్రలో ఉన్నప్పుడు పక్కనున్న వారిపై దాడి చేయడం లేదా ఏకాగ్రత పూర్తిగా కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
ఆ అలవాటు చేసుకోండి
ఈ సమస్య నుంచి బయటపడటానికి రోజూ ఒకే సమయానికి నిద్రపోయే ఆరోగ్యకరమైన అలవాటును చేసుకోవడం చాలా ముఖ్యం.