పుదీనా ఆకులు జీర్ణవ్యవస్థను చురుగ్గా మారుస్తాయి. గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో ఇవి కీలకంగా పనిచేస్తాయి. భోజనం తర్వాత కొన్ని పుదీనా ఆకులు తీసుకోవడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.
డీహైడ్రేషన్ నుంచి రక్షణ :
ఎండ కాలంలో పుదీనా నీళ్లు తాగడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. ఇది శరీరంలో నీటి శాతాన్ని క్రమబద్ధీకరిస్తూ, డీహైడ్రేషన్ బారిన పడకుండా మిమ్మల్ని రోజంతా తాజాగా ఉంచుతుంది.
ఒత్తిడిని తగ్గించే నేచురల్ రిఫ్రెషర్ :
పుదీనాలో ఉండే ఘాటైన సువాసన మనస్సును ప్రశాంతపరుస్తుంది. ఇది తలనొప్పిని తగ్గించడమే కాకుండా, మానసిక అలసట, ఒత్తిడిని దూరం చేసి శరీరానికి శక్తిని ఇస్తుంది.
మిలమిలలాడే చర్మం :
పుదీనాలో ఉండే సాలిసిలిక్ ఆమ్లం మొటిమలను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మంపై మచ్చలను తొలగించి, యవ్వనంగా, ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తాయి.
నేచురల్ డీటాక్స్ డ్రింక్ :
శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి పుదీనా ఒక బెస్ట్ డీటాక్స్ ఏజెంట్. ఒక బాటిల్ నీటిలో కొన్ని పుదీనా ఆకులు, నిమ్మకాయ ముక్కలు వేసి గంట తర్వాత ఆ నీటిని తాగుతుంటే శరీరం లోపల శుభ్రపడి తేలికగా అనిపిస్తుంది.